విపణిలోకి మెర్సిడెస్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు

Written By:

మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి ఏఎమ్‌జి సిఎల్ఎ 45(AMG CLA 45) ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. సరికొత్త 2017 మెర్సిడెస్-ఏఎమ్‌జి సిఎల్ఎ ప్రారంభ ధర రూ. 75.20 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 స్పెసిఫికేషన్స్

సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 కారులో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 375బిహెచ్‌పి పవర్ మరియు 2,250-5,000ఆర్‍‌పిఎమ్ మధ్య గరిష్టంగా 475ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India - DriveSpark
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా మెర్సిడెస్ వారి 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 కేవలం 4.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 డిజైన్

ఫేస్‌లిఫ్ట్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 చూడటానికి దాదాపు మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లో మార్పులు, అప్‌గ్రేడెడ్ ఫ్రంట్ డిజైన్, గ్రిల్ కలదు. గ్రిల్ మధ్యలో త్రీపాయింటెడ్ మెర్సిడెస్ బెంజ్ లోగో ఒదిగిపోయింది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

మెర్సిడెస్ఏఎమ్‌జి సిఎల్ఎ 45 ఏరో ఎడిషన్ సరికొత్త గ్లాస్ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్, ఫ్రంట్ బంపర్ మరియు కారు బాడీ అంచులు వెంబడి, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, సైడ్ స్కర్ట్స్ మరియు 18-అంగుళాల పరిమాణం ఉన్న 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ మీద ఉన్న యెల్లో స్ట్రిప్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

అంతే కాకుండా ఏరో ఎడిషన్ ఫేస్‌లిఫ్ట్ లగ్జరీ సెడాన్‌లో సైడ్ డోర్ల మీద నుండి ఫ్రంట్ బానెట్ మీద వరకు విస్తరించబడిన మరియు రూఫ్ టాప్ మీద నుండి రియర్ బానెట్ మీద వరకు పొడగించబడి ఉన్న గ్రే డీకాల్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఎరుపు రంగు దారంతో స్ట్రిచ్చింద్ చేసిన లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి. 8.0-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు, ఇది 360-డిగ్రీ డిస్ల్పే మాదిరిగా కూడా పనిచేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 ఫేస్‌లిఫ్ట్ ఏరో ఎడిషన్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే విభిన్నంగా ఉంది. మెర్సిడెస్ ఏరో ప్యాకేజీ నూతన డిజైన్ స్టైలింగ్ మరియు బాడీ డీకాల్స్ ఇందులో వచ్చాయి. డీసెంట్ లగ్జరీ సెడాన్ ఎంచుకోవాలనుకునే వారికి ధరతో ఎలాంటి ఇబ్బంది లేకుంటే మెర్సిడెస్ ఏఎమ్‌జి సిఎల్ఎ 45 ఏరో ఎడిషన్ బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Mercedes-AMG CLA 45 Facelift Launched In India At Rs 75.20 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark