మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు
జర్మన్ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త 2017 మెర్సిడెస్-ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీ ధర రూ. 77.85 లక్షలు
జర్మన్ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త 2017 మెర్సిడెస్-ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీ ధర రూ. 77.85 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మెర్సిడెస్-ఏఎమ్‌జి జిఎల్ఎ 45 స్పెసిఫికేషన్స్
సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీల 2.0-లీటర్ టుర్బో ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 1,991సీసీ కెపాసిటి గల టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 375బిహెచ్‌పి పవర్ మరియు 2,250-5,000ఆర్‌పిఎమ్ మధ్య 475ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Recommended Video


7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నుండి ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 డిజైన్ మరియు ఫీచర్లు
ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీ స్వల్ప మార్పులతో అప్‌డేటెడ్ వెర్షన్‌లో వచ్చింది. ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ మెటల్ నిర్మితమైన త్రీ పాయింటెడ్ మెర్సిడెస్ సిగ్నేచర్ లోగో ఫ్రంట్ గ్రిల్ మీద ఒదిగిపోయింది. ముందు వైపు ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ రెండుగా విడిపోయి ఉన్న డిజైన్ తీరును పరిశీలించవచ్చు.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఏరో ఎడిషన్ ద్వారా బాడీ మొత్తం గ్లాస్ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్ మరియు యెల్లే బార్డర్ వచ్చింది. ఫ్రంట్ బంపర్ అంచుల వెంబడి, బాడీ చుట్టూ, సైడ్ స్కర్ట్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు 19-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ మీద యెల్లో కలర్‌లో ఉన్న స్ట్రిప్స్ గమనించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఇంటీరియర్ సరికొత్త ఆల్ బ్లాక్ థీమ్ అప్‌హోల్‌స్ట్రే, లెథర్ సీట్లు మరియు డ్యాష్ బోర్డు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మీద 8.0-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది 360 డిగ్రీల డిస్ల్పే తరహాలో కూడా పనిచేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఎ 45 ఎస్‌యూవీ ఇది వరకే విపణిలోకి లాంచ్ అయ్యింది. అయితే సరికొత్త పెయింట్ స్కీమ్ మరియు డిజైన అప్‌డేట్స్ ద్వారా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వచ్చింది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్45 ఎస్‌యూవీని అరుదైన వెర్షన్‌లో ఎంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








