మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ ఇండియాలో విడుదల: ధర రూ. 2.23 కోట్లు

Written By:

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఏఎమ్‌జి జిటి ఆర్ కారును లాంచ్ చేసింది. 2017 మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ ధర రూ. 2.23 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈ ఏఎమ్‌జి జిటి ఆర్ కారుకు "బీస్ట్ ఆఫ్ ది గ్రీన్ హెల్"(Beast of the Green Hell) అనే నిక్ నేమ్ పెట్టింది.

దీని ధర 2.23 కోట్ల రుపాయాలా... అని హెడ్ లైన్ చూసినపుడే ఆశ్చర్యపోయారు కదా? ఇది ఎందుకింత ధర మరియు ఇందులో ఉన్న ప్రత్యేకతలేంటో నేటి కథనంలో చూద్దాం రండి...

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

దేశం మొత్తం మీద ఎఫ్1 రేస్ ట్రాక్ ఒకటే ఉంది. బుద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‍‌లో ఉన్న రికార్డ్ వేగాన్ని మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి ఆర్ బద్దలుకొట్టింది. కేవలం 2 నిమిషాల 9.853 సెకండ్ల కాలంలోనే ట్రాక్ మొత్తాన్ని చేధించింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి ఆర్ లోని సాంకేతికంగా వివరాలు

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ లో 4.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. ఇది 6,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 577బిహెచ్‌పి పవర్ మరియు 1,900 నుండి 5,500ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 700ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

Recommended Video - Watch Now!
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ గరిష్టం వేగం

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి ఆర్ కేవలం 3.6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్టం వేగం గంటకు 319కిలోమీటర్లుగా ఉంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ లో రియర్ వీల్ స్టీరింగ్ ఫీచర్ కలదు. రియర్ వీల్ స్టీరింగ్: స్టీరింగ్ వీల్ అనుసంధానం సాధారణంగా ముందు చక్రాలకు మాత్రమే ఉంటుంది. అయితే రియర్ వీల్ స్టీరింగ్ ఫీచర్ ఉన్న కార్లలో ముందు మరియు వెనుక రెండు చక్రాలకు స్టీరింగ్ అనుసంధానం ఉంటుంది. మరియు ఇండియాలో రియర్ వీల్ స్టీరింగ్ ఫీచర్‌లో లభించే తొలి కారు ఇదే.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్ కారులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలదు. జిటి3 రేస్ కారు తరహాలో ఇందులో తొమ్మిది రకాల సెట్టింగ్స్ ఉన్నాయి.

ఏఎమ్‌జి జిటి ఆర్ రేస్ కారు జిటి ఎస్ కారుతో పోల్చితే 15 కిలోల వరకు తక్కువ బరువు ఉంటుంది. తేలికపాటి బరువుతో కారును రూపొందించేందుకు హెల్ప్ అయిన అడ్జెస్ట్ చేసుకునే గల సీట్లు, కార్బన్ ఫైబర్ రూఫ్, రియర్ వింగ్ మరియు టైటానియమ్ వంటి వాటికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

బీస్ట్ ఆఫ్ ది గ్రీన్ హెల్ కారు ట్రాక్ ఫోకస్ పెంచేందుకు(అత్యుత్త పనితీరు కోసం) మెర్సిడెస్ ఈ ఏఎమ్‌జి జిటి ఆర్ కారులో జిటి3 రేస్ కారు కోసం అభివృద్ది చేసిన డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్ కలదు. క్షణాల్లో అధిక వేగాన్ని అందుకునేందుకు దోహదమయ్యే యాక్టివ్ ఫ్రంట్ స్ల్పిట్టర్, డబుల్ రియర్ డిఫ్యూసర్ మరియు ఫిక్స్‌డ్ రియర్ స్పాయిలర్ లను అందివ్వడం జరిగింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

2017 మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి ఆర్ డిజైన్

ఏఎమ్‌జి జిటి ఎస్ కారులో పోల్చితే దీనిని ట్రాక్ రేసింగ్ కోసం అధిక ప్రాధాన్యతనిస్తూ డిజైన్ చేసారు. ముందు మరియు వెనుక వైపున డిజైన్ మరింత వెడల్పుగా ఉంది. ముందు భాగం 46ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 57ఎమ్ఎమ్ వరకు వెడల్పుగా ఉంది. మరియు ఓవరాల్ డిజైన్‌ జిటి3 రేస్ కారు ప్రేరణతో రూపొందించబడింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

ముందు వైపున్న అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్‌లో యాక్టివ్ ఫ్రంట్ స్ల్పిట్టర్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్ ఇంజన్ వేడిని బట్టి అధిక గాలిని గ్రహించేందుకు రూపొందించిన గ్రిల్ గుర్తించవచ్చు. 20-అంగుళాల 10-స్పోక్ అల్లాయ్ చక్రాలకు మిచేలియన్ కప్2 టైర్లను జోడించింది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి ఆర్ ఇప్పటికే విపణిలో ఉన్న పోర్షే 911 జిటి3 ఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వనుంది. అయితే పోర్షే తరహాలో పరిమిత సంఖ్యలో మెర్సిడెస్ విక్రయించదు.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ ఇండియా లైనప్‌లో ఏఎమ్‌జి జిటి ఆర్ అత్యంత ముఖ్యమైన మోడల్. ట్రాక్ రేసింగ్ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని విపణిలోకి విడుదలైన ఏఎమ్‌జి జిటి ఆర్ పోటీ ఎరుగకుండా మంచి ఫలితాలు సాధించిపెట్టనుంది.

English summary
Read In Telugu: Mercedes AMG GT R Launched In India; Priced At Rs 2.23 Crore.
Story first published: Monday, August 21, 2017, 16:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark