మెర్సిడెస్ సి-క్లాస్ 'ఎడిషన్ సి' విడుదల: ధర రూ. 42.54 లక్షలు

Written By:

భారతదేశపు అతి పెద్ద లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి సి-క్లాస్‌ ను ఎడిషన్ సి మోడల్‌లో విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ. 42.54 లక్షలు నుండి రూ. 46.87 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

కొత్తగా విడుదలైన ఎడిషన్ సి వేరియంట్లలో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో అప్‌గ్రేడ్స్ జరిగాయి. మెర్సిడెస్ సి-క్లాస్ శ్రేణిలో ఉన్న సి300, సి220డి మరియు 250 డి లలోని అవాంట్‌గ్రేడ్ వేరియంట్లలో ఎడిషన్ సి మోడల్‌ను పరిచయం చేసింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఎడిషన్ సి

కొత్తగా విడుదలైన ఎడిషన్ సి వేరియంట్లలో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో అప్‌గ్రేడ్స్ జరిగాయి. మెర్సిడెస్ సి-క్లాస్ శ్రేణిలో ఉన్న సి300, సి220డి మరియు 250 డి లలోని అవాంట్‌గ్రేడ్ వేరియంట్లలో ఎడిషన్ సి మోడల్‌ను పరిచయం చేసింది.

ఎడిషన్ సి మోడల్‌తో మెర్సిడెస్ బెంజ్ డిజైనో హ్యాసింత్ రెడ్ అనే మరో కొత్త పెయింట్ స్కీమ్‌ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మెర్సిడెస్ విక్రయ కేంద్రాల వద్ద లభించే విధంగా మెర్సిడెస్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ రోలాండ్ ఫాల్గర్ సి-క్లాస్ ఎడిషన్‌ సి మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఎడిషన్ సి

సి-క్లాస్ ఎడిషన్ సి వేరియంట్లలో ఎక్ట్సీరియర్ మీద స్పోర్ట్స్ ఆప్రాన్ స్పాయిలర్, బ్లాక్ పెయింట్ రియర్ స్పాయిలర్, గ్లాస్ ఫినిషింగ్ 5-ట్విన్ స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్ మరియు ఎడిషన్ సి బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఎడిషన్ ధరలు:

వేరియంట్లు ధరలు
సి 200 అవాంట్‌గ్రేడ్ రూ. 42.54 లక్షలు
సి 220 డి అవాంట్‌గ్రేడ్ రూ. 43.54 లక్షలు
సి 250 డి అవాంట్‌గ్రేడ్ రూ. 46.87 లక్షలు

ఎడిషన్ సి వేరియంట్లలో నైట్ ప్యాకేజీగా, బ్లాక్ మిర్రర్ హౌసింగ్స్, బెల్ట్ లైన్ మరియు సైడ్ స్కర్ట్స్ ఉన్నాయి. సి-క్లాస్ నూతన ఎడిషన్‌లో ఫ్రంట్ డోర్ల వద్ద ఓనర్లకు స్వాగతం పలిగే మెర్సిడెస్ బెంజ్ ఎల్ఇడి లోగో ప్రొజెక్టర్ కలదు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఎడిషన్ సి

మెర్సిడెస్ సి-క్రాస్ ఎడిషన్ సి మోడళ్ల ఇంటీరియర్‌లో నల్లటి బూడిద రంగులో ఉన్న కలప ఇంటీరియర్, స్టెయిన్ లెస్ స్టీల్ స్పోర్ట్స్ పెడల్స్, గార్మిన్ మ్యాప్ పైలట్ ఎస్‌డి కార్డ్ న్యావిగేషన్ సిస్టమ్ వంటివి అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ తమ లైనప్‌ సి-క్లాస్ శ్రేణిలో ఉన్న వేరియంట్లకు స్పోర్టివ్ ఫీల్ కల్పిస్తూ ఎడిషన్ సి వెర్షన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ వేరియంట్లలో డిజైన్, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ మీద స్వల్పంగా మార్పులు చేసి పండుగ సీజన్‌లో ప్రీమియమ్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి మెర్సిడెస్ ఈ ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Mercedes-Benz C-Class ‘Edition C’ Launched In India; Prices Start At Rs 42.54 Lakh
Story first published: Tuesday, October 3, 2017, 18:38 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark