ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు క్లీనింగ్ ట్రక్కును ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్

Written By:

దేశీయంగా లగ్జరీ కార్ల తయారీ మరియు విక్రయాల్లో దిగ్గజ సంస్థగా నిలిచిన మెర్సిడెస్ బెంజ్ తమ కార్పోరేట్ సామాజిక కార్యకలాపాల్లో భాగంగా న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(NDMC)కు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వాక్యూమ్ క్లీనింగ్ ట్రక్కును విరాళమిచ్చింది.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు క్లీనింగ్ ట్రక్కును ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ భారత్ బెంజ్ కమర్షియల్ వాహనాల విభాగానికి చెందిన రహదారులను శుభ్రపరిచే వాహనాన్ని ప్రధానం చేసింది. ఇది రోడ్లను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ వీధుల్లో ధుమ్ముధూళి స్థాయిని తగ్గించడంలో ఈ వాక్యూమ్ క్లీనర్ ట్రక్కు మేలైన ఫలితాలనిస్తుందని భారత్ బెంజ్ అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు క్లీనింగ్ ట్రక్కును ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్

ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యానికి ఉన్న ప్రధాన కారకాలలో ధుమ్ముధూళి కణాలు కీలకంగా ఉన్నాయి. ఢిల్లీ వీధుల్ని ధుమ్ము ధూళి నుండి శుభ్రంగా ఉంచడంలో భారత్ బెంజ్ స్వీపర్ ట్రక్కులు చక్కగా పనిచేస్తాయి.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు క్లీనింగ్ ట్రక్కును ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్

భారత్ బెంజ్ 1214ఆర్ ఆధారంగా మీడియం డ్యూటీ ప్లాట్‌ఫామ్ మీద ఈ స్వీపర్ ట్రక్కును అభివృద్ది చేశారు. అంతే కాకుండా భారత్ బెంజ్ పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో క్లీనింగ్ యంత్రాలను మరియు పరికరాలను ఉత్పత్తి చేస్తోంది.

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు క్లీనింగ్ ట్రక్కును ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్

రోడ్లు మరియు పరిశ్రమలలో అత్యుత్తమ స్వీపింగ్ నాణ్యతలో ఈ ట్రక్కును ధీటైన పనితీరును కనబరుస్తుంది. పూర్తి స్థాయిలో శక్తివంతమైన, నాణ్యమైన మరియు ధృడమైన వాహనం అని చెప్పవచ్చు. నిర్మాణం పరంగానే కాకుండా ఇది విడుదల చేసే ఉద్గారాల పరంగా కూడా ఉత్తమ వాహనం. సెలక్టివ్ క్యాటలిటిక్ టెక్నాలజీ ఆధారంగా నిరూపించబడిన మరియు బిఎస్-IV ఉద్గారని నియమాలను పాటిస్తుంది.

English summary
Read In Telugu To Know More About Mercedes-Benz Donates Cleaning Truck To Delhi Municipal Council
Story first published: Tuesday, June 6, 2017, 18:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark