2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలు...

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ జిఎల్ఎ కారును 2017 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విపణిలోకి విడుదల చేసింది. ఈ 2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ప్రారంభ ధర రూ. 30.65 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

By Anil

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ జిఎల్ఎ కారును 2017 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విపణిలోకి విడుదల చేసింది. ఈ 2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ప్రారంభ ధర రూ. 30.65 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ఇంజన్, వేరియంట్లు, ధరలు, ఫీచర్లు మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ లగ్జరీ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది. అందులో, జిఎల్ఎ200 స్పోర్ట్, జిఎల్ఎ 200డి స్టైల్, జిఎల్ఎ 200డి స్పోర్ట్స్ మరియు జిఎల్ఎ 220డి 4 మ్యాటిక్. వీటిలో జిఎల్ఎ 200 స్పోర్ట్ మాత్రమే పెట్రోల్ వెర్షన్‌లో లభిస్తుంది. నూతన పన్ను విధానం జిఎస్‌టి అమలు చేయడంతో అన్ని వేరియంట్ల ధరలు నాలుగు లక్షల వరకు తగ్గాయి.

వేరియంట్ల వారీగా ధర వివరాలు

వేరియంట్ల వారీగా ధర వివరాలు

వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరలు
జిఎల్‌ఎ 200 స్పోర్ట్ ధర రూ. 32.20 లక్షలు
జిఎస్ఎ 200డి స్టైల్ ధర రూ. 30.65 లక్షలు
జిఎల్ఎ 200డి స్పోర్ట్ ధర రూ. 33.85 లక్షలు
జిఎల్ఎ 220డి 4 మ్యాటిక్ ధర రూ. 36.75 లక్షలు
2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ఇంజన్ వివరాలు

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ఇంజన్ వివరాలు

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ఇంజన్ వివరాలు:

నాలుగు వేరియంట్లలో లభించే జిఎల్‌ఎ రెండు ఇంజన్ ఆప్షన్‌లో లభిస్తుంది. అవి, రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే 2.1-లీటర్ టుర్బో డీజల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

జిఎల్ఎ 200 డి లోని డీజల్ ఇంజన్‌ ఉత్పత్తి చేసే 134బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్‌కు అందుతుంది. మరియు జిఎల్ఎ 9.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం 205కిమీలుగా ఉంది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

జిఎల్‌ఎ 220డి 4 మ్యాటిక్ వేరియంట్లో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు అదనంగా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు. ఇందులో అందించిన ఇంజన్ 168బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకునే దీని గరిష్ట వేగం గంటకు 218కిలోమీటర్లుగా ఉంది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

పెట్రోల్ వేరియంట్:

మెర్సిడెస్ బెంజ్ లోని జిఎల్ఎ 200 స్పోర్ట్ వెర్షన్‌లో మాత్రమే లభించే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది కేవలం 7.6 సెకండ్ల వ్యవధిలో 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం 225కిమీలుగా ఉంది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

డిజైన్:

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ ఫ్రంట్ డిజైన్‌లో నూతన డిజైన్‌ శైలిలో ఉన్న ఫ్రంట్ బంపర్ మరియు బై-జెనాన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. మునుపటి జిఎల్ఎ ఫ్రంట్ డిజైన్ స్థానంలో అనేక లక్షణాల పూర్తిగా మారిపోయాయి. డిక్కీ మరియు బానెట్ డోర్లను తెరిచినపుడు మరియు మూసినపుడు అదే విధంగా ఎస్‌యూవీని లాక్ మరియు అన్ లాక్ చేసినపుడు ఫ్రంట్ బంపర్ మధ్యలో అందించిన త్రీ పాయింట్ మెర్సిడెస్ లోగో వెలుగుతుంది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

మునుపటి జిఎల్ఎ తో పోల్చుకుంటే ఎస్‌యూవీ ఫీల్‌ను పెంచేందుకు చివర్లో ఎత్తును పెంచడం జరిగింది. రైడింగ్ కాస్త ఎత్తులో ఉంచారు. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు 235/50 ఆర్18 సైజులో ఉన్న టైర్లను జోడించడం జరిగింది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

రియర్ డిజైన్‌లో ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు బార్డర్ డిజైన్ పరంగా మార్పులు జరిగాయి. రియర్ బంపర్‌ మరియు బాడీని అనుసంధానం చేస్తూ మధ్యలో బ్లాక్ కలర్‌లో ఉన్న ప్లాస్టిక్ బంపర్ ఎస్‌యూవీ ఫీల్‌‌ను మరింత పెంచుతుంది.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

ఫేస్‌లిఫ్ట్ జిఎల్ఎ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. మరియు నాలుగు డోర్లకు ఇల్యుమినేటెడ్ డోర్ సిల్స్ అందించారు.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీటును ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం, కొత్త కంట్రోల్స్‌తో నూతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్, 12 విభిన్న రంగుల్లో ఉన్న ఆంబియంట్ లైటింగ్ మరియు ప్యానరోమిక్ సన్ రూఫ్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో కలవు.

2017 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ విడుదల

భద్రత పరంగా 2017 జిఎల్ఎ లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, అడాప్టివ్ బ్రేకింగ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ వంటి ప్రధాన ఫీచర్లతో పాటు డ్రైవర్‌కు ఆడియో ద్వారా వివిధ సూచనలు చేసే వ్యవస్థను అందివ్వడం జరిగింది.

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Mercedes-Benz GLA Launched In India; Prices Start At Rs 30.65 Lakh
Story first published: Wednesday, July 5, 2017, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X