మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే ఇండియాలో విడుదల: ధర రూ. 74.80 లక్షలు

Written By:

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయంగా ఉన్న మెర్సిడెస్ ఏఎమ్‌జి లైనప్‌లో కొనసాగింపుగా జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే కారును రూ. 74.80 లక్షల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరతో విడుదల చేసింది.

జిఎల్‌సి ఎస్‌యూవీ ఆధారంగా వచ్చిన, సరికొత్త మెర్సిడెస్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే కారును జిఎల్‌సి శ్రేణిలో టాప్ స్పెక్ వేరియంట్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్ జిఎల్‌సి 43 ఏమ్‌జి కూపే కారును తొలుత సెప్టెంబర్ 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

సాంకేతికంగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే కారులో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి6 బై-టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 367బిహెచ్‌పి పవర్ మరియు 520ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ 9జి-ట్రోనిక్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నుండి 4-మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. 4-మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లోని టార్క్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ ద్వారా 69 శాతం టార్క్ వెనుక చక్రాలకు మరియు 31 శాతం ముందు చక్రాలకు చేరుతుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కేవలం 4.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 250కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

ఈ కూపే కారులో ఏఎమ్‌జి డైనమిక్ సెలక్ట్ సిస్టమ్ కలదు, కారులోని ఐదు విభిన్న డ్రైవింగ్ మోడ్స్: ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మరియు ఇండివిడ్యువల్ ద్వారా డ్రైవర్ డ్రైవింగ్ మోడ్ ఎంచుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

మెర్సిడెస్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే లీటర్‌కు గరిష్టంగా 12కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. అధిక పవర్ ఉత్పత్తి చేయగల 3.0-లీటర్ ఇంజన్ ఈ తరహా మైలేజ్ ఇస్తుందనడం గురించి సందేహిస్తున్నారా...? కారును ఎకో మోడ్‌లో డ్రైవ్ చేసినపుడు మాత్రమే ఈ మైలేజ్ సాధ్యం అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

సరికొత్త క్రాసోవర్ కూపే కారులో అభివృద్దిపరిచిన ఛాసిస్, ఎయిర్ బాడీ కంట్రోల్ మరియు మూడు దశలలో అడాప్టివ్ డ్యాంపిగ్ కంట్రోల్ గల ఏమ్‌జి రైడ్ కంట్రోలో స్పోర్ట్స్ సస్పెన్షన్ సిస్టమ్, స్పీడ్ సెన్సిటివ్ వేరిబుల్ రేషియో స్టీరింగ్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

ఏమ్‌జి కూపే వేగాన్ని నియంత్రించడానికి ముందు వైపున నాలుగు పిస్టన్ కాలిపర్స్ గల 360ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు చక్రాలకు సింగల్ పిస్టన్ కాలిపర్ గల 320ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న డిస్క్ బ్రేక్ కలదు. 19-అంగుళాల పరిమాణం గల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ లేదా 21-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్ ఎంచుకోవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

స్టాండర్డ్ వెర్షన్ జిఎల్‌సితో పోల్చుకుంటే జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే న్యూ లుక్‌ను సొంతం చేసుకుంది. ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ పిన్నులు గల బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు బంపర్ కలవు. మరియు క్రోమ్ ఫినిషింగ్ గల బంపర్ గుర్తించగలరు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

ఎక్ట్సీరియర్‌లో గుర్తించదగిన మరో మార్పు ఫ్రంట్ మిర్రర్ నుండి మొదలయ్యే రూఫ్ లైన్ చివరి వరకూ వాలుతో ఉండి, రియర్ ఎండ్ ముగిసే ప్రదేశంలో ఉబ్బెత్తుగా ఉండే స్పాయిలర్‌ను గమనించగలం. అదే విధంగా రియర్ బంపర్‌లో రెండు వైపులా రెండు చొప్పున ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

ఎక్ట్సీరియర్ మాత్రమే కాకుండా ఇంటీరియర్‌ను కూడా స్పోర్టివ్‌గా డెవలప్‌ చేశారు. ఇందులో ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్లు, రెడ్ స్టిచ్చింగ్ గల ఆల్-బ్లాక్ లెథర్ అప్‌‌హోల్‌స్ట్రే, బ్లూటూత్ మరియు యుఎస్‌బి కనెక్టివిటి గల 7.0-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్టిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

డిసెంబర్ 2016లో యూరోపియన్ మార్కెట్లో విడుదలైన జిఎల్‌సి ఏఎమ్‌జి కూపే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 మరియు పోర్షే మకన్ లకు పోటీగా ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన ఏఎమ్‌జి కూపే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎమ్40ఐ కారుకు పోటీనిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా లగ్జరీ కార్ల మార్కెట్ శరవేగంగా వృద్ది చెందుతోంది. ఈ తరుణంలో మెర్సిడెస్ బెంజ్ ప్రత్యేకించి ఏఎమ్‌జి బ్రాండ్ క్రింద సరికొత్త జిఎల్‌సి 43 ఏఎమ్‌జి కూపే కారును ఆవిష్కరించింది. దీంతో శక్తివంతమైన మరియు ఫీచర్లతో నిండిన ఏమ్‌జి కూపే భారీ సక్సెస్ ఇవ్వనుంది.

English summary
Read In Telugu: 2017 Mercedes-Benz GLC 43 AMG Coupe Launched In India; Priced At Rs 74.80 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark