జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం 70 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్‌సి ఎస్‌యూవీని సెలబ్రేషన్ ఎడిషన్‌లో పరిమిత సంఖ్యలో విపణిలోకి విడుదల చేసింది.
70 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్‌సి ఎస్‌యూవీని సెలబ్రేషన్ ఎడిషన్‌లో పరిమిత సంఖ్యలో విపణిలోకి విడుదల చేసింది. అరుదైన మెర్సిడెస్ జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్ ఎస్‌యూవీ ధర రూ. 50.86 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

అతి కొద్ది సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్న సెలబ్రేషన్ ఎడిషన్ జిఎల్‌సి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిలో,
- మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 220డి సెలబ్రేషన్ ఎడిషన్ (డీజల్) ధర రూ. 50.86 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 300 సెలబ్రేషన్ ఎడిషన్ (పెట్రోల్) ధర రూ. 51.25 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.
- ఎల్ఇడి లోగో ప్రొజెక్టర్
- హై గ్లాస్ బ్లాక్ ఎక్ట్సీరియర్ మిర్రర్
- స్పోర్ట్స్ పెడల్స్
- గార్మిన్ మ్యాప్ పైలట్(MAP PILOT)
- హై-షీన్ క్రోమ్ ట్రిమ్
- క్రోమ్ పట్టీ గల రియర్ ట్రిమ్
Recommended Video


జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అవి,

జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్ విడుదల సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా సిఇఒ రోలాండ్ ఫోల్జర్ మాట్లాడుతూ, " 70 వ భారత స్వాతంత్ర్యపు దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిఎల్‌సి ఎస్‌యూవీని సెలబ్రేషన్ ఎడిషన్‌గా విడుదల చేయడం పట్ట సంతోషంగా ఉంది, క్లాస్ లీడింగ్ పర్ఫామెన్స్, రాజీపడని భద్రత ఫీచర్లు, అత్యాధునిక ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లతో స్పోర్టివ్ మరియు లగ్జరీ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లకు జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుందని తెలిపాడు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియాలో వచ్చే ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలుచుకుని కస్టమర్లకు చేరువయ్యేందుకు మెర్సిడెస్ బెంజ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 70 వ స్వాతంత్రపు దినోత్సవ సందర్భంగా జిఎల్‌సి సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కస్టమర్లలో ఆసక్తి మరియు పోటీని రేపడానికి అతి కొద్ద సంఖ్యలో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచడాన్ని మెర్సిడెస్ వ్యూహాత్మక ప్రణాళిక అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








