మిని ఎలక్ట్రిక్: పూర్తిగా విద్యుత్‌తో నడిచే మినీ ఎలక్ట్రిక్ కారు ఉద్గారాలు శూన్యం
బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన భాగస్వామ్యపు సంస్థ మినీ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడానికి సర్వం సిద్దం చేసుకుంది.
బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన భాగస్వామ్యపు సంస్థ మినీ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడానికి సర్వం సిద్దం చేసుకుంది. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, మినీ తమ సరికొత్త, తొలి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 2017లో జరగనున్న ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించనుంది.

మినీ వద్ద ఉన్న మూడు డోర్ల హ్యాచ్‌బ్యాక్ సిరీస్ కార్లలో సరికొత్త బ్యాటరీ-ఎలక్ట్రిక్ మినీ ఒక కొత్త వేరియంట్‌గా చేరనున్నట్లు బిఎమ్‌డబ్ల్యూ గ్రూపు గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. 2019 నాటికి ఇది ప్రొడక్షన్ దశకు చేరుకోనుంది.
Recommended Video


ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్ జోడింపుతో పాటు అదనంగా పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్‌లను వీటిలో అందించే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ మరియు ఇంధనంతో నడిచే హైబ్రిడ్ వేరియంట్, అదే విధంగా పూర్తిగా 100 శాతం విద్యుచ్ఛక్తితో నడిచే ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభించనుంది.

ఎలక్ట్రిక్‌మినీ కారు కోసం కావాల్సిన పవర్‌ట్రైన్‌ను బవేరియా లోని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇ-మొబిలిటి సెంటర్ అభివృద్ది చేయనుంది. బవేరియా నుండి ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్ లో ఉన్న మినీ ప్రొడక్షన్ ప్లాంటుకు చేర్చనుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ3 ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఆధారంగా ఎలక్ట్రిక్‌మినీ రూపొందుతోంది. ఎలక్ట్రిక్ వెర్షన్ మూడు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారు గురించి బిఎమ్‌డబ్ల్యూ మరియు మినీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మినీ ఈ నెల చివరి నాటికి అధికారికంగా ఆవిష్కరించి సెప్టెంబర్ 2017 లో జరగనున్న ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వేదిక ప్రజా సందర్శనకు సిద్దం చేయనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మినీ తమ తొలి ఎలక్ట్రిక్ త్రీ డోర్ హ్యాచ్‌బ్యాక్ కారును ఈ నెల చివర్లో అధికారికంగా ఆవిష్కరించనుంది. మినీ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంయుక్తంగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అభివృద్ది చేస్తుంది కాబట్టి, బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ ఎక్స్3 కారును కూడా అభివృద్ది చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








