మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుదల: 44 లక్షల ఖరీదైన ఈ కారులోని ప్రత్యేకతలు

Written By:

బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియన్ మార్కెట్లోకి జాన్ కూపర్ వర్క్స్ ప్రొ ఎడిషన్ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది. జాన్ కూపర్ వర్క్స్(JCW) ట్యూనింగ్ కిట్ గల సరికొత్త మినీ కూపర్ ఎస్ మూడు డోర్ల హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 43.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్వు మినీ వెల్లడించింది.

జాన్ కూపర్ వర్క్స్ ట్యూనింగ్ కిట్‌తో పాటు, కూపర్ ఎస్ సరికొత్త వెర్షన్‌లో జెసి‌డబ్ల్యూ స్టైలింగ్ కార్ యాక్ససరీలు ఉన్నాయి.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

JCW డిజైన్ హౌస్ నుండి సేకరించిన ప్రత్యేకమైన కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ మినీ కూపర్ ఎస్ జెసి‌డబ్ల్యూ ప్రొ ఎడిషన్‌లో ఉన్నాయి. ఎరుపు రంగులో ఉన్న రూఫ్ మరియు ఓఆర్వీఎమ్స్ మరియు స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ అని సూచించేందుకు మ్యాట్ బ్లాక్ మరియు రెడ్ పెయింట్ స్ట్రిప్స్ ఉన్నాయి.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

JCW ప్రొ ఎడిషన్ కారులో బ్లాక్ సరౌండింగ్స్ గల స్పోర్ట్స్ ఎల్ఇడి హెడ్ లైట్లు, JCW ఏరోడైనమిక్ ప్యాకేజ్ మరియు వెనుక వైపు JCW చిహ్నం కలదు. పైబర్ ఫినిషింగ్ గల డ్యూయల్ పైప్ ఎగ్జాస్ట్, నియంత్రించే సదుపాయం గల ఎగ్జాస్ట్ వాల్వ్ మరియు 17-అంగుళాల పరిమాణం ఉన్న కాస్మోస్ స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ ఇంటీరియర్‌లో అల్కంటారా ఫినిషింగ్ గల జాన్ కూపర్ వర్క్స్ స్పోర్ట్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్‌తో పాటు లెథర్ తొడుగు గల JCW స్టీరింగ్ వీల్ మరియు పెడల్ షిఫ్టర్స్ కలవు.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

డ్రైవింగ్‌లో ఉన్నపుడు పర్ఫామెన్స్ పెంచేందుకు ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల స్టీరింగ్ వీల్, జాన్ కూపర్ వర్క్స్ డోర్ సిల్స్, గేర్ సెలక్టర్ లీవర్ అదే విధంగా 12-స్పీకర్లున్న హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ మరియు లాంచ్ కంట్రోల్ ఫీచర్లున్నాయి.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

సాంకేతికంగా మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ హ్యాచ్‍‌బ్యాక్ కారులో 2-లీటర్ల సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ట్విన్ టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 208బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.5-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

పవర్‌ఫుల్ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంఫర్ట్, స్పోర్ట్ మరియు ఎఫీషియన్సీ మూడు విభిన్న డ్రైవింగ్‌ మోడ్‌లలో డ్రైవ్ చేయవచ్చు. భద్రత పరంగా ఇందులో, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు రన్-ఫ్లాట్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి.

మినీ కూపర్ ఎస్ JCW ప్రొ ఎడిషన్ విడుద

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మినీ కూపర్ ఎస్ మూడు డోర్ల లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా జెసిడబ్ల్యూ ప్రొ ఎడిషన్ అభివృద్ది చేశారు. చూడటానికి ఆకర్షణీయంగా కనిపించేందుకు మినీ కూపర్ ఎస్‌ ను ప్రత్యేక జెసిడబ్ల్యూ ట్యూనింగ్ కిట్ అందించి ప్రొ ఎడిషన్‌లో విడుదల చేసింది.

ప్రైజ్ సమస్య కాదనే కస్టమర్లకు ఇదొక పర్ఫామెన్స్, స్పోర్ట్స్ మరియు లగ్జరీ కారు అని చెప్పవచ్చు. జెసిడబ్ల్యూ ప్రొ ఎడిషన్ కావాలనుకునే వారు అమెజాన్ ఇండియాలో మాత్రమే కొనుగోలు చేయగలరు.

English summary
Read In Telugu: MINI JCW Pro Edition Launched In India; Priced At Rs 43.90 Lakh
Story first published: Tuesday, October 3, 2017, 17:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark