పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీ మీద ధరలు తగ్గించిన మిత్సుబిషి
భారత ప్రభుత్వం జూలై 1, 2017 నుండి నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టిని అమల్లోకి తెచ్చిన తరువాత జపాన్ దిగ్గజం మిత్సుబిషి తమ పజేరో స్పోర్ట్ ధరలను సవరించింది.
భారత ప్రభుత్వం జూలై 1, 2017 నుండి నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టిని అమల్లోకి తెచ్చిన తరువాత జపాన్ దిగ్గజం మిత్సుబిషి తమ పజేరో స్పోర్ట్ ధరలను సవరించింది. జిఎస్‌టికి అనుగుణంగా చేపట్టిన ధరల సవరణలో భాగంగా పజేరో స్పోర్ట్ ధరలు భారీ తగ్గుముఖం పట్టాయి.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ లోని దాదాపు అన్ని వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 1,04,740 ల వరకు ధరలు తగ్గాయి. ధరల తగ్గింపు అనంతరం మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 26.64 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ధరలు...
| వేరియంట్లు | GST ముందు | GST అనంతరం | ధరల వ్యత్యాసం |
| 2.5-లీ ఆటోమేటిక్ 4X2 | 27.69 లక్షలు | 26.64 లక్షలు | 1.04 లక్షలు |
| 2.5-లీ ఆటోమేటిక్ 4X2 లిమిటెడ్ ఎడిషన్ | 28.18 లక్షలు | 27.13 లక్షలు | 1.04 లక్షలు |
| 2.5-లీ మ్యాన్యువల్ 4X4 | 28.09 లక్షలు | 27.04 లక్షలు | 1.04 లక్షలు |
| 2.5-లీ మ్యాన్యువల్ 4X4 | 28.59 లక్షలు | 27.54 లక్షలు | 1.04 లక్షలు |
Recommended Video


సాంకేతికంగా పజేరే స్పోర్ట్ ఎస్‌యూవీలోని 2.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 175బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. 2-వీల్ డ్రైవ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ 350ఎన్ఎమ్ టార్క్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే వేరియంట్ గరిష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మిత్సిబిషి మే 2017 న పజేరో స్పోర్ట్ ను సెలక్ట్ ప్లస్ వేరియంట్లో విపణిలోకి విడుదల చేసింది. ఇది కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభిస్తోంది. కొన్ని అదనపు ఫీచర్ల జోడింపుతో వచ్చిన సెలక్ట్ ప్లస్ వేరియంట్లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ వేరియంట్లోని ఎక్ట్సీరియర్ మీద బ్లాక్ కలర్‌లో ఉన్న రూఫ్, పిల్లర్స్ , ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చెస్, డోర్లు మరియు ఫ్రంట్ బంపర్ మీద బ్లాక్ క్లాడింగ్ అందివ్వడం జరిగింది. అదే విధంగా ఆవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ మీద్ బ్లాక్ కప్స్ ఉన్నాయి.

పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ వేరియంట్లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, హెచ్ఐడి హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ సీట్ హెడ్ రెస్ట్ మీద డివిడి ప్లేయర్ అందివ్వడం జరిగింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పజేరో స్పోర్ట్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఆశించిన మేర విక్రయాలు సాధించడం లేదు. అయితే జపాన్ దిగ్గజం మిత్సుబిషి తాజాగా అందుబాటులోకి తెచ్చిన సెలక్ట్ ప్లస్ వేరియంట్ ప్రస్తుతం ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీలతో గట్టిపోటీని ఎదుర్కుంటోంది.
అయితే జిఎస్‌టి అనుగుణంగా లక్ష రుపాయల వరకు ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు పజేరో స్పోర్ట్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








