లంక మీద విజయానంతరం మల్టిక్స్‌తో రెచ్చిపోయిన ధోని

Written By:

వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను మట్టి కరిపించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను తనదైన శైలిలో ముగించి లంకేయులకు చుక్కలు చూపించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ తమ ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

ఈ వండే సిరీస్ ఆటగాళ్లకు కొన్ని మైలురాళ్లను సాధించిపెట్టగా, క్రికెట్ అభిమానులకు కొన్ని మధురస్ముతలను మిగల్చింది. టీమిండియా మొత్తం మల్టిక్స్ వాహనంలో గ్రౌండ్‌లో సరదా రైడింగ్ చేసి, ప్రేక్షకులకు కనువిందు చేశారు.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టు శ్రీలంకను టీమిండియా అలవోకగా చేధించి, టీమిండాయ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ఐదు వికెట్లు సాధించిన భువనేశ్వర్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డ్ అందుకోగా, సిరీస్ మొత్తం మీద 15 వికెట్లను తీసుకున్న బూమ్రా "మ్యాన్ ఆఫ్ ది సిరీస్" అవార్డు అందుకున్నాడు.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా పేస్ బౌలర్ బెస్ట్ ప్లేయర్‌ జస్‌ప్రీత్ బూమ్రాకు ఐషర్ పొలారీస్ సంస్థ మల్టిక్స్ వాహనాన్ని బహుకరించింది. వెంటనే, ఎమ్ఎస్ ధోని మల్టిక్స్ స్టీరింగ్ తన చేతిలోకి తీసుకుని మ్యాచ్ అనంతరం స్టేడియంలోనే మరో రికార్డు సాధించాడు.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

ధోని వెహికల్ స్టార్ట్ చేయగానే, మొత్తం 11 మంది టీమ్ ప్లేయర్లు ఐదు మాత్రమే కూర్చునే వీలున్న మల్టిక్స్ వెహికల్‌లోకి నిండిపోయారు. అప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న టీమిండియా మొత్తం ధోని రైడ్‌తో ఆనందఢోలికల్లో మునిగిపోయి స్టేడియంలోని అభిమానులకు కనువిందు చేశారు.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

ఐషర్ పొలారీస్ మల్టిక్స్

పొలారీస్ సంస్థ ప్రాంతీయ మార్కెట్‌ లక్ష్యంతో మల్టిక్స్‌ను 3-ఇన్-1 వెహికల్‌గా విక్రయిస్తోంది. ఇందులో ఐదు మంది వరకు ప్రయాణించే సీటింగ్ సామర్థ్యం, లగేజ్ లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు మల్టిక్స్‌ను జనరేటర్‌లా వినియోగించుకుంటే 3కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

ఐషర్ పొలారీస్ మల్టిక్స్‌లో ఎక్స్-పోర్ట్ అనే అదనపు యాక్ససరీ ద్వారా జనరేటర్‌గా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మెషీన్ లేదా ఒక ఇంట్లోని లైటింగ్ సిస్టమ్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇందులో ఉంది.

పోలారిస్ మల్టిక్స్ డ్రైవ్ చేసిన ధోని

పొలారీస్ మల్టిక్స్ వాహనంలో 510సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 3,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 9.8బిహెచ్‌పి పవర్ మరియు 1,400-2,200ఆర్‌పిఎమ్ మధ్య 27ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

పొలారీస్ మల్టిక్స్ మైలేజ్ లీటర్‌కు 28.45కిలోమీటర్లుగా ఉంది. అంతే కాకుండా, ఇది పెట్రోల్ ఇంధనంతో కూడా నడుస్తుంది.

English summary
Read In Telugu: MS Dhoni Team Ride In Multix After Winning ODI Series SriLanka
Story first published: Monday, September 4, 2017, 17:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark