ఏ4 35 టిడిఐ డీజల్ సెడాన్ వేరియంట్‌ను విడుదల చేసిన ఆడి
శక్తివంతమైన డీజల్ వేరియంట్ ఏ4 సెడాన్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. మునుపటి డీజల్ వేరియంట్ ఏ4 కన్నా ఇది 7 శాతం అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగలదని ఆడి పేర్కొంది. ధర మరియు ఇంజన్ వివరాలు....
ఆడి ఇండియా దేశీయంగా ఏ4 35 టిడిఐ డీజల్ వేరియంట్ ను విడుదల చేసింది. మునుపటి ఏ4 డీజల్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఇది ఏడు శాతం మెరుగైన మైలేజ్ ఇవ్వగలదని ఆడి పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ. 40.20 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు ఆడి తెలిపింది. ఏ4 లోని పెట్రోల్ వేరియంట్‌ను సెప్టెంబర్ 2016 లో విపణిలోకి ప్రవేశపెట్టింది.

ఆడి సరికొత్త ఏ4 35 టిడిఐ వేరియంట్ 2.0-లీటర్ సామర్థ్యం గల, టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం సరికొత్త ఏ4 35 టిడిఐ డీజల్ వేరియంట్ లీటర్‌కు 18.25 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదని ఆడి ఇండియా పేర్కొంది. ఇది వరకే ఉన్న డీజల్ వేరియంట్ ఏ4 తో పోల్చుకుంటే ఈ నూతన వేరియంట్ 7 శాతం మెరుగైన మైలేజ్ ఇవ్వగలదు.

వేడుదల వేదిక మీద ఆడి ఇండియా ముఖ్య అధికారి రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, "అత్యంత విజయవంతమైన మోడల్‌కు కొనసాగింపుగా మరో వేరియంట్‌ను అభివృద్ది చేయడం అంత సులువు కాదని, నూతనంగా చేసిన మార్పుల ద్వారా ఏ4 సెడాన్‌కు మరింత విలువను పెంచామని తెలిపాడు".

ప్రస్తుతం ఉన్న లగ్జరీ సెడాన్లలోకెల్లా అత్యద్బుతమైన టెక్నాలజీ మరియు సౌందర్యానికి సరికొత్త ఆడి ఏ4 35 టిడిఐ నిదర్శణం అని అన్సారీ చెప్పుకొచ్చారు. ఆడి ఇండియాకు మంచి విజయాన్ని సాధించి పెట్టిన ఏ4 సెడాన్‌లో ఈ మధ్యనే ఏ4 30 టిఎఫ్ఎస్ఐ వేరియంట్ విడుదల చేశామని, ఈ సెగ్మెంట్లో ఇప్పుడు అధునాతమైన డీజల్ వెర్షన్ ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించాడు.

ఆడి ఏ4 35 టిడిఐ సెడాన్ ప్రస్తుతం విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కార్లకు ప్రత్యక్ష పోటీనివ్వనుంది.

మొదటి ప్రమాదానికి గురైన టాటా హెక్సా ఎమ్‌పీవీ...టేక్ కేర్..!!
2017 లో ఇండియాలో విడుదల కానున్న ఐదు కొత్త స్కూటర్లు


Click it and Unblock the Notifications








