సరికొత్త క్యూ5 లాంచ్ డేట్ ప్రకటించిన ఆడి

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయాడనికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంటోంది.

By Anil

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయాడనికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఎన్నో మార్పులకు గురైన అప్‌డేటెడ్ వెర్షన్ ఆడి క్యూ5 పలు మార్లు రహస్యంగా మీడియా కంటబడింది.

ఆడి క్యూ5

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఆడి ఇండియా తమ క్యూ5 ఎస్‌యూవీని వచ్చే ఏడాది జనవరి 18 వ తేదీని మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్దమైంది. అప్‌డేట్స్‌కు గురైన ఇందులో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

Recommended Video

Volvo's Smallest SUV XC40 Is All Set To Be Launched In India - DriveSpark
ఆడి క్యూ5

ఆడి క్యూ5 ఫ్రంట్ డిజైన్ చూడానికి అచ్చం అవుట్ గోయింగ్ మోడల్‌నే పోలి ఉంటుంది. ఆడి వారి ఫ్లెక్సిబుల్ ఎమ్‌ఎల్‌బి ఎవో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా క్యూ7 ఆధారంతో నిర్మించింది. సింగల్ ఫ్రేమ్ గ్రిల్, ఆడి సిగ్నేచర్ మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి.

ఆడి క్యూ5

ఆడి క్యూ5 ఫ్రంట్ బంపర్‌ డిజైన్ పరంగా మార్పులకు గురయ్యింది. అధిక మొత్తంలో ఇంజన్‌కు గాలిని గ్రహించే లార్జ్ ఎయిర్ ఇంటేకర్ కలదు. అయితే, ఫాగ్ ల్యాంప్స్ ఇందులో మిస్సయ్యాయి. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే దీని బరువు సుమారుగా 100కిలోల వరకు తగ్గే అవకాశం ఉంది.

ఆడి క్యూ5

ఆడి క్యూ5 సాంకేతికంగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 2-లీటర్ డీజల్ ఇంజన్‌తో రానుంది. అంతే కాకుండా, 252బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది. రెండు ఇంజన్‌లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానున్నాయి.

ఆడి క్యూ5

నూతన క్యూ5 ఇంటీరియర్‌లో ఆడి వర్చువల్ కాక్‌పిట్ కలదు. 12.3-అంగుళాల పరిమాణం గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 8.3-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు హెడ్స్ అప్ డిస్ల్పే ఉన్నాయి. వీటితో పాటు వైర్ లెస్ ఛార్జింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ5

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న సరికొత్త ఆడి క్యూ5 విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు ఈ మధ్యనే తాజాగా విడుదలైన వోల్వో ఎక్స్‌సి60 లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. దీని ధర సుమారుగా రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2017, 11:41 [IST]
English summary
Read In Telugu: New Audi Q5 India Launch Date Confirmed
Read more on: #audi #ఆడి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+