హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

Written By:

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా వచ్చే నెలలో విడుదలవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ డీలర్లు రూ. 25,000 ల ధరతో బుకింగ్స్ స్వీకరిస్తున్నారు.

హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభం

తరువాత తరం వెర్నాను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్దమవుతోంది. వెర్నా సెడాన్ విడుదలను సూచిస్తూ, ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలను విడుదల చేస్తూ, టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

సరికొత్త హ్యుందాయ్ వెర్నా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, క్రోమ్ సొబగులు ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు ఎలంట్రాలో అందించిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఇందులో అందిస్తోంది.

హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభం

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ ఫ్లూయిడిక్ స్కల్ప్‌చర్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగించి డెవలప్‌ చేస్తున్న తొలి మోడల్ వెర్నా సెడాన్. గత పదేళ్ల కాలంలో గ్రాండ్ ఐ10, క్రెటా మరియు ఐ20 కార్ల కంటే ముందే ప్రి-ఫేస్‌లిఫ్ట్ వెర్నా ద్వారా సక్సెస్ రుచి చూసింది హ్యుందాయ్.

హ్యుందాయ్ వారి తాజా డిజైన్ ఫిలాసఫీ ఫ్లూయిడిక్ స్కల్ప్‌చర్ 2.0 ఆధారంగా వస్తున్న వెర్నా, ఆరవ తరానికి చెందిన హ్యుందాయ్ ఎలంట్రా నుండి ఎన్నో డిజైన్ లక్షణాలను పొందింది. హ్యుందాయ్ విడుదల చేసిన టీజర్ ఫోటోల ద్వారా డిజైన్‌ లక్షణాలను గుర్తించవచ్చు.

హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభం

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి భద్రత ఫీచర్లు స్టాండర్డ్‌గా రానున్నాయి.

హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభం

సరికొత్త వెర్నా గతంలో ఉన్న అవే ఇంజన్ వేరియంట్లలో రానుంది. ఇదే కనుక నిజమైతే, 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. రెండు ఇంజన్ వేరియంట్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో రానుంది.

హ్యుందాయ్ వెర్నా మీద బుకింగ్స్ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఒకానొక కాలంలో హ్యుందాయ్ వెర్నా మిడ్ సైజ్ సెడాన్ ద్వారా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన సరికొత్త వెర్నా పూర్తి స్థాయిలో విపణిలోకి వస్తే, మార్కెట్లో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ కార్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం!

English summary
Read In Telugu: New-Generation Hyundai Verna To Be Launched Next Month; Bookings Open
Story first published: Wednesday, July 19, 2017, 18:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark