నెక్ట్స్ జనరేషన్ వెర్నా ఇంటీరియర్ రివీల్ చేసిన హ్యుందాయ్

Written By:

హ్యుందాయ్ తమ తరువాత తరానికి చెందిన వెర్నా సెడాన్ కారును విడుదలకు సిద్దం చేస్తోంది. అయితే ఇప్పుడు అధికారికంగా 2017 వెర్నా ఇంటీరియర్ ఫోటోలను రివీల్ చేసింది.

నెక్ట్స్ జనరేషన్ వెర్నా అతి త్వరలో వస్తోంది అని తెలుపుతూ ఓ టీజర్ ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం వెర్నాకు పోటీగా ఉన్న ప్రీమియమ్ సెడాన్‌లను ఎదుర్కునేందుకు బ్లాక్ మరియు బీజి క్యాబిన్ కలర్స్‌తో పాటు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను జోడించింది.

హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్ రివీల్

హ్యుందాయ్ రివీల్ చేసిన వెర్నా ఇంటీరియర్ ఫోటోలో మోనోక్రోమ్ స్క్రీన్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు కప్ హోల్డర్స్ కలవు. అంతే కాకుండా ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణం ఇన్ఫోటై‌మెంట్ సిస్టమ్‌ను టాప్ రేంజ్ వేరియంట్లో అందివ్వనుంది.

హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్ రివీల్

హ్యుందాయ్ గతంలో నెక్ట్స్ జనరేషన్‌ వెర్నా కారు ఫ్రంట్ డిజైన్‌కు సంభందించిన టీజర్ ఫోటో రివీల్ చేసింది. ఇందులో ఫ్రంట్ గ్రిల్ డిజైన్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఆకృతి, ఫాగ్ ల్యాంప్స్ వంటి వాటిని వివరిస్తూ, హ్యుందాయ్ వారి 2.0 ఫ్లూయిడిక్ స్కల్పచర్ డిజైన్ భాషను పరిచయం చేసింది.

హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్ రివీల్

2017 హ్యుందాయ్ వెర్నాలో సాంకేతికంగా 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో రానుంది. వచ్చే ఆగష్టు 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడులయితే మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Next-Generation Hyundai Verna Interior Teased Ahead Of Launch
Story first published: Tuesday, July 4, 2017, 13:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos