నెక్ట్స్ జనరేషన్ వెర్నా టీజర్ విడుదల చేసిన హ్యుందాయ్

Written By:

హ్యుందాయ్ మోటార్స్ తమ నెక్ట్స్ జనరేషన్ వెర్నా సెడాన్ విడుదలను సూచిస్తూ, అప్ కమింగ్ వెర్నా అఫీషియల్ టీజర్ ఫోటోను రిలీజ్ చేసింది. దక్షిణ కొరియారీ మ్యానుఫ్యాక్చరర్ హ్యుందాయ్ నూతన వెర్నాను ఆగష్టు 2017 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

విడుదలకు సిద్దమైన వెర్నా ఫ్రంట్ ప్రొఫైల్‌కు చెందిన ఫోటోను టీజర్ రూపంలో రివీల్ చేసింది. దీని ఎల్ఇడి డే టైం రన్నింగ్ ల్యాంప్ క్లస్టర్ పరిశీలిస్తే, తాజాగా విడుదలైన ఎలంట్రా ప్రేరణతో వచ్చినట్లు తెలుస్తోంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

ప్రస్తుతం ఎక్సిక్యూటివ్ సెడాన్ సెగ్మెంట్లో రాణిస్తున్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి మరియు స్కోడా ర్యాపిడ్ లకు గట్టిపోటీనిచ్చేందుకు కంపెనీ యొక్క ఫ్ల్యూయిడిక్ 2.0 డిజైన్ శైలిలో రానుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో పాటు ధృడమైన స్టీల్‌తో తేలికపాటి బాడీని నిర్మిస్తోంది. ఇది మునుపటి మోడల్ వెర్నా కన్నా ధృడమైనది. స్పెన్షన్ పరంగా కూడా భారీ మార్పులు జరగనున్నాయి.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

పోటీని ఎదుర్కుని రాణించేందుకు ఇంటీరియర్‌లో భారీ మార్పులే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఆప్షన్ అనుసంధానం గల 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ రానుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

ఇంజన్ విషయానికి వస్తే, అవే 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ ఇంజన్ వేరియంట్లలో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో రానుంది.

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా టీజర్

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా వేరియంట్ల వారీగా రూ. 8 నుండి 13 లక్షల శ్రేణిలో అంచనా ధరతో విడుదల అయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ వెర్నాను విడుదల చేసిన తొలినాళ్లలో మంచి ఫలితాలు సాధించింది. అయితే మార్కెట్‌కు అనుగుణంగా పోటీగా వచ్చిన మోడళ్లలో ఎదుర్కోవడం మరియు నూతన ఫీచర్లను అందివ్వడంలో హ్యుందాయ్ వెనుకంజ వేసింది. అయితే నెక్ట్స్ జనరేషన్ రాకతో తన స్థానాన్ని తిరిగి పధిలం చేసుకోవడం ఖాయం.

English summary
Read In Telugu Next-Generation Hyundai Verna Teased — Launch Imminent
Story first published: Wednesday, June 21, 2017, 17:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark