హ్యుందాయ్ ఐ20, మారుతి బాలెనో లకు పోటీగా రానున్న కియా రియో ఇదే...

2019 నుండి ఇండియన్ మార్కెట్లో కార్లను విక్రయించనున్న కియా మోటార్స్ రియో పల్స్ లిమిటెడ్ ఎడిషన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్టీ వెర్షన్‌లో ఆవిష్కరించింది.

By Anil

2019 నుండి ఇండియన్ మార్కెట్లో కార్లను విక్రయించనున్న కియా మోటార్స్ రియో పల్స్ లిమిటెడ్ ఎడిషన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్టీ వెర్షన్‌లో ఆవిష్కరించింది.

ఇంగ్లాండులో కియా మోటార్స్ తమ రియో పల్స్ ను లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రదర్శించింది. ఇది క్లియర్ వైట్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ స్కీమ్‍‌లో అందుబాటులో ఉంది. రెగ్యులర్ మోడల్‌తో పోల్చుకుంటే వ్యత్యాసం ఉండేందుకు రూఫ్ టాప్, ఫ్రంట్ మరియు సైడ్ స్కర్ట్స్ మీద అదే విధంగా మిర్రర్ క్యాప్స్ లను ఎరుపు రంగులో అందించారు.

కియా రియో పల్స్ ఎడిషన్

క్రోమ్ పట్టీతో ఉన్న బ్లాక్ రేడియేటర్ గ్రిల్, రియర్ విండో మరియు టెయిల్ గేట్ ప్రైవసీ గ్లాస్‌తో వచ్చాయి. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు 205/45 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

Recommended Video

Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
కియా రియో పల్స్ ఎడిషన్

కియా రియో పల్స్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఎక్ట్సీరియర్ తరహా రెడ్ కలర్ థీమ్ ప్రత్యేకతలున్నాయి. ఇంటీరియర్‌లో బ్లాక్ మరియు రెడ్ ఫాక్స్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే(కారు లోపలి వైపు టాప్) కలదు. డ్యాష్ బోర్డ్ మొత్తం రెడ్ కలర్ మెటాలిక్ పెయింట్ మరియు ఫాక్స్ రెడ్ లెథర్ డోర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి.

కియా రియో పల్స్ ఎడిషన్

అదనంగా స్పోర్టివ్ లెథర్‌ తొడుగులు గల స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ ఉన్నాయి. అంతే కాకుండా రియో పల్స్ ఎడిషన్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, వెహికల్ స్టెబిలి మేనేజ్‌మెంట్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, స్ట్రైట్ లైన్ స్టెబిలిటి మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కియా రియో పల్స్ ఎడిషన్

కియా రియో పల్స్ ఎడిషన్ ఇంటీరియర్‌లో 5-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తోంది. డిఎబి రేడియో, బ్లూటూత్ కనెక్టివిటి మరియు యుఎస్‌బి పాయింట్స్ కలవు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానం చేసిన రివర్స్ కెమెరా మరియు 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ కలదు.

కియా రియో పల్స్ ఎడిషన్

సాంకేతికంగా కియా రియో పల్స్ ఎడిషన్‌లో 1.25-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 83బిహెచ్‌పి పవర్ మరియు 121ఎన్ఎమ్ టార్క్ ముందు చక్రాలకు అందుతుంది. 12.5 సెకండ్ల వ్యవధిలో 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల రియో గరిష్టంగా గంటకు 172కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కియా రియో పల్స్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా రియో రెగ్యులర్ వెర్షన్‌కి, పల్స్ ఎడిషన్‌‌కు పెద్దగా వ్యత్యాసం లేదు. అయితే ఇండియన్స్‌కు తొలిసారి కావడంతో వచ్చే ఏడాదిలో దీని అధిక డిమాండ్ లభించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: India-Bound Kia Motors Reveals Rio Pulse Edition
Story first published: Saturday, July 22, 2017, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X