2017 స్విఫ్ట్ డిజైర్‌ డిజైన్‌లో జరిగిన భారీ మార్పులు - ఫోటోలు లీక్

Written By:

మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మందికి ఇది కలల కారు. అయితే మారుతి ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్ స్థానంలో నూతన 2017 స్విఫ్ట్ డిజైర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. 2017 స్విఫ్ట్ డిజైర్‌గా పిలువబడే ఈ మోడల్ ఫ్రంట్ డిజైన్ పరంగా అనేక మార్పులకు గురయ్యింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ఇంటర్నెట్ వేదికగా రహస్యంగా లీకయిన 2017 స్విఫ్ట్ డిజైర్ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫ్రంట్ డిజైన్‌లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌ను సుజుకి జపాన్ మార్కెట్లో విడుదల చేసిన స్విఫ్ట్‌ ఫ్రంట్ గ్రిల్‌ను పోలి ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

రియర్ డిజైన్‌లో మార్పులకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చింది మారుతి. సియాజా సెడాన్ తరహాలో బుట్ లిడ్(డిక్కీ డోర్ మీద ఉన్న రూపం)ను కాస్త ఉబ్బెత్తుగా తీర్చిదిద్దింది. స్పోర్టివ్ శైలిని కల్పించేందుకు నూతన టెయిల్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

డిజైన్ పరంగా స్వల్ప మార్పులే సంభవించినప్పటికీ ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్‌గా ఉన్న దీనికి ఈ మార్పులు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్లతో పోల్చితే భిన్నంగా ఉండే ఇది విడుదలయ్యాక మంచి సక్సెస్‌కు దారితీయనుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి లైనప్‌లో ఇప్పటికే ఉన్న 83బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే పెట్రోల్ మరియు 74బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే డీజల్ ఇంజన్ ఆప్షన్లను ఈ సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్‌లో కొనసాగించనున్నారు.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో రానున్న సరికొత్త స్విఫ్ట్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ఇతర అప్‌డేట్స్ చోటుచేసుకోనున్నాయి.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌ను విడుదల చేయడానికంటే ముందుగా 2017 స్విఫ్ట్ డిజైర్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న పోటీదారులను దృష్టిలో ఉంచుకుని దీని ధరలను నిర్ణయించనుంది.

English summary
Also Read In Telugu: 2017 Maruti Suzuki Swift Dzire Spotted, Up coming 2017 maruti suzuki swift dzire engine, mileage, features, specifications, photos and more in telugu
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark