ఇ-క్లాస్ శ్రేణిలో ఇ220 డి డీజల్ మోడల్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బెంజ్ ఇ220డి డీజల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇ-క్లాస్ శ్రేణిలో ఈ ఇ220డి ప్రారంభ డీజల్ వేరియంట్‌ను రూ. 57.14 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి విడుదల చేసింది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఇ-క్లాస్ శ్రేణిలో ప్రారంభ డీజల్ వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఇ220డి పేరుతో విడుదలైన ఈ లగ్జరీ సెడాన్ ధర రూ. 57.14 లక్షలు ఎక్స్-షోరూమ్ (ముంబాయ్)గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇ350డి మోడల్‌కు క్రింది స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది.

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి ఈ మధ్యనే ఇ-క్లాస్ లాంగ్ వీల్ బేస్ సెడాన్‌ను విడుదల చేసింది. మరియు ఇ-క్లాస్ లోని ప్రారంభ పెట్రోల్ వేరియంట్ ఇ200 ను గతంలో రూ. 56.7 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి విడుదల చేసింది.

గతంలో ఉన్న ఇ250డి మోడల్(మార్కెట్ నుండి తొలగించింది) స్థానంలో మెర్సిడెస్ ఈ ఇ220 డీజల్ కారును విడుదల చేసింది. సాంకేతికంగా ఈ ఇ220డిలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉన్న ఇది గరిష్టంగా 191బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

డిజైన్ పరంగా చూస్తే, ఇ350డి మోడల్ డిజైన్‌ను అచ్చుపోలిందని చెప్పవచ్చు. అయితే ఇంజన్ విషయానికి వస్తే చిన్న ఇంజన్ కలిగి ఉంది. అంతే కాకుండా సౌకర్యవంతమైన ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్ల ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేదు. 360డిగ్రీ కెమెరా కూడా రాలేదు.

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ డీజల్ శ్రేణిలోని ఇ220డి కారు ఇంటీరియర్‌లో స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అనుసంధానం గల 12.3-అంగుళాలు ఉన్న కమాండ్ ఆన్ లైన్ మీడియా డిస్ల్పే కలదు. ఇ-క్లాస్ శ్రేణి కార్లలో ప్రసిద్దిగాంచిన బాడీ ఎయిర్ కంట్రోల్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వలేదు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోని లగ్జరీ సెడాన్ కార్ల సెగ్మెంట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, వోల్వో ఎస్90, ఆడి ఏ6 మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్‌లతో గట్టిపోటీని ఎదుర్కోనుంది.


Click it and Unblock the Notifications