నెక్ట్స్ జనరేషన్ డస్టర్ ఇంటీరియర్ రివీల్ చేసిన రెనో

Written By:

రెనో యూరోపియన్ బ్రాండ్ డేసియా, సరికొత్త నెక్ట్స్ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీ ఫోటోలను ఈ మధ్యనే రివీల్ చేసింది. స్పోర్టివ్ మరియు స్టైలిష్ ఎక్ట్సీరియర్‌కు ప్రాధాన్యమిచ్చిన డేసియా, అదే తరహాలోనే ఇంటీరియర్‌‌ను రూపొందిస్తోంది. తరువాత తరం డస్టర్ ఇంటీరియర్ ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి.

రెనో డస్టర్ ఇంటీరియర్ రివీల్

2018 రెనో డస్టర్ ఇంటీరియర్‌ను స్వల్పంగా వివరించే ఫోటోలు ఓ వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా లీక్ అయ్యాయి. మునుపటి తరానికి చెందిన డస్టర్ ఇంటీరియర్‌తో పోల్చుకుంటే దాదాపు అన్ని అంశాల పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రెనో డస్టర్ ఇంటీరియర్ రివీల్

డస్టర్ ఫ్రంట్ మిర్రర్‌ను 100మిల్లీమీటర్ల వరకు ముందుకు జరిపినట్లు రెనో తెలిపింది. తద్వారా విశాలమైన క్యాబిన్ సాధ్యమవుతోంది. డస్టర్ ఇంటీరియర్‌లో ఫోర్ స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి రానున్నాయి.

రెనో డస్టర్ ఇంటీరియర్ రివీల్

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ క్యాబిన్ మరియు ఉత్సాహభరితమైన ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో రానుంది. విశాలమైన డ్యాష్ బోర్డ్ మీద ఉన్న రెండు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్లు స్టీరింగ్ వీల్‌కు ప్రక్కగా ఉన్నాయి. అదే విధంగా మూడు ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. గేర్‌లీవర్ తర్వాత వెహికల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కంట్రోల్ చేసుకునేందుకు రోటరీ డయల్ సెలక్టర్ కలదు.

రెనో డస్టర్ ఇంటీరియర్ రివీల్

డ్యాష్ బోర్డ్ మొత్తం బ్లాక్ ఫినిషింగ్ కలిగి ఉంది. ప్యాసింజర్ సైడ్ డోర్ ప్యానల్స్, మరియు సెంటర్ కన్సోల్ మీద అల్యూమినియం మరియు ఆరేంజ్ స్ట్రిప్స్ ఉన్నాయి. సరికొత్త డస్టర్ డ్యాష్ బోర్డ్, అప్‌హోల్‌స్ట్రే మరియు సీట్లను విభిన్న రకాలుగా ఎంచుకునే అవకాశం కల్పిచనుంది.

రెనో డస్టర్ ఇంటీరియర్ రివీల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన డస్టర్ ఎక్ట్సీరియర్ కూడా విప్లవాత్మక మార్పులతో రానుంది. సరికొత్త ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ సొబగులతో సిద్దమవుతున్న 2018 డస్టర్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే, తన పూర్వవైభవాన్ని తిరిగి పొందడం ఖాయం.

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu: New Renault Duster Interior Images Leaked Ahead Of Debut

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark