స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

Written By:

స్కోడా తమ ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదలను సూచిస్తూ, అనేక దఫాలుగా పరీక్షిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఇది వరకే దీనిపై బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు తమ ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల జూలై మధ్యలో ఉండనుందని స్కోడా అధికారికంగా ప్రకటించింది.

స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్

సరికొత్త స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో కాస్మొటిక్ సొబగులతో రానుంది. దీనికి తోడు, ఫ్రంట్ డిజైన్‌లో రెండు విడిపోయి ఉన్న హెడ్ లైట్లకు మధ్యలో కొత్త ఫ్రంట్ గ్రిల్ రానుంది. ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్ బంపర్‌లో కూడా అప్‌గ్రేడ్స్ నిర్వహించారు.

స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్

నూతన స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌లో ఎల్ఇడి లైటింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్‌ స్పోర్ట్ చేయగల 8-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు డోర్ల మీద గొడుగులు, రియర్ వ్యూ కెమెరా, మరియు హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిప్ట్ ఆక్టావియా ఇంజన్ సాంకేతిక వివరాలు చూస్తే, స్కోడా లైనప్‌లో ఉన్న అవే, 1.4-లీటర్ మరియు 1.8-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో అదే విధంగా ఈ ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్

స్కోడా ఇండియా విభాగం దేశీయంగా తమ ఆక్టావియా ప్రీమియమ్ సెడాన్‌ను ఉత్తమ పనితీరు కోసం విఆర్ఎస్ వెర్షన్‌లో కూడా విడుదల చేయనుంది. ఈ ఆక్టివియా విఆర్ఎస్ లో అభివృద్ది పరిచిన ఇంజన్‌, సస్పెన్షన్ మరియు స్పోర్టి లక్షణాలతో రూపొందించనుంది.

Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu To Know More Skoda Octavia Facelift India Launch Date Confirmed
Story first published: Friday, June 9, 2017, 18:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark