సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ బ్రోచర్ లీక్

Written By:

జపాన్ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్‌ 2017 లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించడానికి సిర్వం సిద్దం చేసుకుంది. ఇప్పుడు స్విఫ్ట్ స్పోర్ట్‌‌కు చెందిన బ్రోచర్ లీక్ అయ్యింది.

ఓ ట్విట్టర్ ఖాతాదారుడు బ్రోచర్ లోని స్విఫ్ట్ స్పోర్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. ఫ్రంట్ డిజైన్ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ ఇందులో మిక్కిలి ఆకర్షణగా నిలిచింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

సుజుకి స్విప్ట్ స్పోర్ట్ ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ బంపర్, మరియు పదునైన గీతలతో మరింత ఆకర్షణీయంగా ఉంది. క్రోమ్ టిప్ గల డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ఫాక్స్ డిఫ్యూసర్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్‌లోని హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో బకెట్ టైప్ సీట్లు, ఎర్రటి సొబగులున్న గేర్ లీవర్, ఇంటీరియర్ కలదు అదే విధంగా రెడ్ అండ్ గ్రే కలర్‌లోనే ఇంస్ట్రుమెంట్ కలదు.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

లీకయిన బ్రౌచర్ ద్వారా సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఆరు విభిన్న కలర్ ఆప్షన్‌‌లలో లభిస్తుందని చెబుతోంది. అవి, పసుపు, ఎరుపు, నీలం, తెలుపు, గ్రే మరియు బ్లాక్. స్విఫ్ట్ స్పోర్ట్ సాంకేతిక వివరాలు సెప్టెంబర్ 12, 2017 న జరగనున్న ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షో వేదిక మీద విడుదల కానున్నాయి.

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డిజైన్ పరంగా సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్ మీద భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతికంగా ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ వచ్చే అవకకాశం ఉంది. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్ 2018 ఆటో ఎక్స్ పో వేదక మీద ప్రదర్శనకు రానుంది.

English summary
Read In Telugu: New Suzuki Swift Sport Brochure Leaked
Story first published: Monday, July 31, 2017, 10:44 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark