ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన హ్యుందాయ్ వెర్నా
భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తమ కొత్త తరం వెర్నా మిడ్ సైజ్ సెడాన్ ద్వారా ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డును గ్రహించింది.
భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తమ కొత్త తరం వెర్నా మిడ్ సైజ్ సెడాన్ ద్వారా ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డును గ్రహించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికీ వరకు ఐదు కార్లకు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. 2018లో వెర్నా, 2016లో క్రెటా, 2015లో ఎలైట్ ఐ20, 2014లో గ్రాండ్ ఐ10 మరియు 2008 సంవత్సరంలో ఐ10 వంటి కార్లకు ICOTY అవార్డులు లభించాయి.

18 మంది జ్యూరీ సభ్యులు కొత్త తరం హ్యుందాయ్ వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కారును 2018 ఏడాదికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు. జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రఘుపతి సింఘానియా ICOTY ట్రోఫీని హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వై.కె. కూ గారికి అందించారు.
Recommended Video


హ్యుందాయ్ మోటార్స్ ఆల్ న్యూ నెక్ట్స్ జనరేషన్ వెర్నా కారును ఆగష్టు 2017లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. విడుదలైనప్పటి నుండి హ్యుందాయ్ వెర్నా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

హ్యుందాయ్ వెర్నా విడుదలైన కేవలం నెల రోజుల్లోపే 7,000 కు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది. మరియు దేశవ్యాప్తంగా ఎంతో మంది కొత్త వెర్నా గురించి డీలర్లను సంప్రదించారు.

న్యూ వెర్నా సాంకేతికంగా రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. అవి, 1.6-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లు. ఇందులో హ్యాండ్స్ ఫ్రీ డిక్కీ డోర్ ఓపెన్, కూల్డ్ సీట్స్ ఇంకా ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా వై.కె. కూ మాట్లాడుతూ,"ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుగా పేరుగాంచిన ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ కోసం ఇండియాలో తయారైన హ్యుందాయ్ వెర్నాకు అవార్డు లభించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
గత ఐదేళ్ల కాలంలో హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎన్నో మోడళ్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డును వరించింది. డిజైన్, ఫీచర్లు, నిర్మాణ నాణ్యత, భద్రత, వినియోగదారుల సంతృప్తి, స్పేర్స్ మరియు సర్వీసింగ్ వంటి ఎన్నో అంశాల పరంగా హ్యుందాయ్ ఎంతో మంది భారతీయుల మనస్సును చూరగొంది.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








