విపణిలోకి లీఫ్ ఎలక్ట్రిక్ కారును తెచ్చే ఆలోచనలో నిస్సాన్
నిస్సాన్ తమ తరువాత తరానికి చెందిన లీఫ్ కారును అతి త్వరలో అంతర్జాతీయ విపణిలోకి ఆవిష్కరించనుంది. ఈ తరుణంలో నిస్సాన్ తాజాగా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ద్వారా లీఫ్ టీజర్ ఫోటోను విడుదల చేసింది.
నిస్సాన్ తమ తరువాత తరానికి చెందిన లీఫ్ కారును అతి త్వరలో అంతర్జాతీయ విపణిలోకి ఆవిష్కరించనుంది. ఈ తరుణంలో నిస్సాన్ తాజాగా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ద్వారా లీఫ్ టీజర్ ఫోటోను విడుదల చేసింది.

సెప్టెంబర్ 6, 201 7న ప్రపంచ విపణిలోకి ఆవిష్కరించనున్నట్లు టీజర్ ఫోటో ద్వారా ట్విటర్ వేదికగా నిస్సాన్ వెల్లడించింది. అదే విధంగా ఈ నెక్ట్సన్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్ లీఫ్ ను 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద కూడ ప్రదర్శించనుంది.

నిస్సాన్ విడుదల చేసిన టీజర్ ఫోటోలో ఫ్రంట్ గ్రిల్ మరియు నిస్సాన్ లోగో మినహాయిస్తే, ఎలాంటి డిజైన్ ఫీచర్లను గుర్తించలేము. ఈ లీఫ్ హ్యాచ్‌బ్యాక్‌ను నిస్సాన్ వారి ఐడిఎస్ కాన్సెప్ట్ మరియు మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఆధారంతోపొందించింది.

2018 నాటికి పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దం కానున్న లీఫ్ ఎలక్ట్రిక్ కారులో ప్రొపైలట్ అసిస్ట్ ఫీచర్ ను నిస్సాన్ అందివ్వనుంది. ఈ సెమీ-అటానమస్ టెక్నాలజీ ద్వారా హై వే మీద ప్రయాణిస్తున్నపుడు తనంతట తానుగా నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 340కిమీల నుండి 360కిమీల వరకు ప్రయాణించనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఉన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో నెక్ట్స్ జనరేషన్ లీఫ్ ఒక కొత్త పోటీకి తెరదించనుంది. మార్కెట్ నిపుణుల మేరకు నిస్సాన్ తమ లీఫ్ ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications








