TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ధరల పెంపును అధికారికంగా ప్రకటించిన నిస్సాన్ ఇండియా
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజానికి చెందిన ఇండియా విభాగం, నిస్సాన్ ఇండియా దేశీయంగా విక్రయించే తమ అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిచింది. ధరల పెంపు అనంతరం సవరించబడిన కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి అమల్లోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
నిస్సాన్ మరియు డాట్సన్ బ్రాండ్ క్రింది ఉన్న కార్ల ధరలను నిస్సాన్ ఇండియా సుమారుగా రూ. 15,000 ల వరకు పెంచనుంది. పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి.
ధరల పెంపు వివిధ వేరియంట్లో మధ్య వేరు వేరుగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు పెరగడం మరియు తయారీ భారం అధికమవ్వడంతో ధరల పెంపు చేపడుతున్నట్లు నిస్సాన్ ఇండియా వెల్లడిచింది.
నిస్సాన్ ఇండియా లైనప్‌లో మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్, టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ జిటి-ఆర్ సూపర్ కారును విక్రయిస్తోంది. నిస్సాన్ జిటి-ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 కోట్లుగా ఉంది.
నిస్సాన్ ఇండియా డాట్సన్ బ్రాండ్ క్రింద గో, గో ప్లస్ మరియు రెడి-గో వంటి సరసమైన హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయిస్తోంది. ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ,"తయారీ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు నిర్ణయం అనివార్యమైందని చెప్పుకొచ్చాడు."
నిస్సాన్ మాత్రమే కాదు, దేశీయ మార్కెట్లో ఉన్న పలు ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు జనవరి 1, 2018 నుండి ధరలు పెంచనున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించాయి. మహీంద్రా, స్కోడా, జీప్, వోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్, ఇసుజు మరియు టయోటా కిర్లోస్కర్ ఇండియా తమ కార్ల మీద ధరలు పెంపుకు సిద్దమయ్యాయి.
Trendind On DriveSpark Telugu:
మారుతి సుజుకి గుండె గుబేలుమనే వార్త!!
రోడ్డు క్రాస్ చేసేటపుడు ఇలాంటి పొరపాటు చేయకండి
మారుతి సుజుకి కార్లలో సరికొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
Trending DriveSpark Telugu YouTube Videos