ఇండియాకొస్తున్న నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీకి క్రాష్ పరీక్షలు

జపానీస్ ఆటోమేకర్ నిస్సాన్ తమ కిక్స్ కాంపారక్ట్‌ ఎస్‌యూవీని 2018లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీకి నిర్వహించిన లాటిన్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ ఫలితాల

By Anil

జపానీస్ ఆటోమేకర్ నిస్సాన్ తమ కిక్స్ కాంపారక్ట్‌ ఎస్‌యూవీని 2018లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీకి నిర్వహించిన లాటిన్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.

నిస్సాన్ కిక్స్

బ్రెజిల్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ అత్యుత్తమ ఫలితాలు కనబరిచింది. లాటిన్ ఎన్‌సిఎపి ప్రమాణాల మేరకు ఐదింటికి గాను నాలుగు స్టార్ల రేటింగ్ దక్కించుకుని మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది.

Recommended Video

Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
నిస్సాన్ కిక్స్

నిస్సాన్ వారి వి-ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన మోడల్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ప్రిటెన్షనర్ల జోడింపుతో ఉన్న సీట్ బెల్టులు మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్

చిన్న పిల్లలు మరియు పెద్దలు ఇద్దరి భద్రత పరంగా నాలుగు స్టార్ల రేటింగ్ పొందింది. అయితే, ముందు నుండి ప్రమాదం జరిగినపుడు నిర్మాణ స్ట్రక్చర్ మరియు వెహికల్‌లోప ఫుట్ ఏరియా నిర్మాణ్యత బాగాలేకపోవడం కారణంగా పెద్ద భద్రత విషయంలో ఒక స్టార్ కోల్పోయింది.

నిస్సాన్ కిక్స్

అదే విధంగా పిల్లల భద్రత విషయంలో ఎయిర్ బ్యాగులు డియాక్టివేషన్ స్విచ్ లేకపోవడం మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ సంభందించిన అలర్ట్స్ లేకపోవడంతో ఒక స్టార్ కోల్పోయింది. ఎక్ట్సీరియర్ క్రాష్ పరీక్షల్లో మంచి ఫలితాలను నమోదు చేసుకుంది.

Trending on DriveSpark Telugu:

నిస్సాన్ కిక్స్

కిక్స్ ఎస్‌యూవీని కంపెనీ వి-ఫ్లాట్‌ఫామ్ మీదనే అభివృద్ది చేసినప్పటికీ, తక్కువ ఖర్చుతో నిర్మించేందుకు ఎమ్‌ఒ ఆర్కిటెక్చర్ మీద ఉత్పత్తి చేసే ఆలోచనలో నిస్సాన్ ఉంది. ఈ మధ్యనే విపణిలోకి విడుదలైన రెనో క్యాప్చర్ మరియు డస్టర్ ఎస్‍‌యూవీలు కూడా ఈ ఎమ్‌ఒ ఫ్లాట్‌ఫామ్‌ను పంచుకున్నాయి.

నిస్సాన్ కిక్స్

నిస్సాన్ తమ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇండియా విడుదల 2018లో ఉంటుందని ఇప్పటికే ఖరారు చేసింది. సాంకేతికంగా నిస్సాన్ కిక్స్ 1.5-లీటర్ కెపాసిటి గల కె9కె డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇదే ఇంజన్ టెర్రానో, డస్టర్ మరియు క్యాప్చర్ ఎస్‌యూవీలలో ఉంది.

నిస్సాన్ కిక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ విపణిలోకి కిక్స్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విడుదల చేస్తే టెర్రానో పై స్థానంలో నిలవనుంది. మార్కెట్లో ఉన్న రెనో క్యాప్చర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500, హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ వంటి ఎస్‌యూవీల నోరు మూయించనుంది. ఇది సుమారుగా రూ. 9 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Thursday, December 21, 2017, 10:39 [IST]
English summary
Read In Telugu: India-Bound Nissan Kicks Scores Impressive Rating In Latin NCAP Crash Test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+