నిస్సాన్ తలరాతను మార్చనున్న కిక్స్ ఎస్‌యూవీ

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లోకి తమ అతి ముఖ్యమైన ప్రొడక్ట్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. అతి త్వరలో విపణిలోకి కిక్స్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోందని ఓ ఆన్‌లైన్ మీడియా పేర్కొంది.

నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

ఇండియాలో డస్టర్ మరియు టెర్రానో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తోన్న కిక్స్ ఎస్‍‌యూవీని నిస్సాన్ 2016 లోనే అంతర్జాతీయ విపణిలో ఆవిష్కరించింది. ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, నిస్సాన్ తమ కిక్స్ విడుదల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

టెర్రానో పై స్థానాన్ని భర్తీ చేయనున్న కిక్స్ ఎస్‌యూవీ, ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రెనో అభివృద్ది చేసిన కప్తుర్ ఎస్‌యూవీకి గట్టి పోటీనివ్వనుంది. నిస్సాన్ ఇప్పటి వరకు కిక్స్ వెహికల్‌కు సంభందించిన సాంకేతిక వివరాలను వెల్లడించలేదు.

నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

అయితే మావద్ద ఉన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ కిక్స్ సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ లేదా రెనో కప్తుర్ కోసం అభివృద్ది చేసిన 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. రెనో తమ డస్టర్ ఎస్‌యూవీలో తాజాగ పరిచయం చేసిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించే ఛాన్స్ ఉంది.

నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

నిస్సాన్ కిక్స్ ఎక్ట్సీరియర్‌లో ఫంకీ లుక్స్‌చో ఉన్న ఫ్రంట్ డిజైన్ మరియు ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ మరియు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ ఉంది. ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ థీమ్ డ్యాష్‌బోర్డ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరియు ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

రానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద నిస్సాన్ తమ కిక్స్ ఎస్‌యూవీని ప్రదర్శించాల్సి ఉంది. ఆటో ఎక్స్ పో లో నిస్సాన్ పాల్గొనడం లేదు. కాబట్టి 2018లోనే నిస్సాన్ కిక్స్ విడుదల ఉండనుంది.

నిస్సాన్ కిక్స్ విడుదల వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం అతి ప్రధానమైన సెగ్మెంట్. ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా ఈ సెగ్మెంట్లోకి తమ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. నిస్సాన్ కిక్స్ 15 నుండి 20 లక్షల అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. విపణిలో ఉన్న క్రెటా మరియు కంపాస్‌లతో పాటు రెనో కప్తుర్ లకు పోటీగా నిలవనుంది.

English summary
Read In Telugu: Nissan To Introduce Kicks Compact SUV In India
Story first published: Wednesday, August 23, 2017, 11:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark