నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, ధర, ఇంజన్ వివరాలు....

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ ప్రేరణతో ఫ్యాషన్ ఎడిషన్‌ను స్టైలిష్‌గా తీర్చిదిద్దారు.

By Anil

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.09 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు నిస్సాన్ తెలిపింది.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

ప్రపంచ దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ ప్రేరణతో నిస్సాన్ మైక్రా ను ఫ్యాషన్ ఎడిషన్ పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రవేశపెట్టింది. నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి, ఫ్యాషన్ బ్లాక్ మరియు ఫ్యాషన్ ఆరేంజ్.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్‌లో నిస్సాన్ కనెక్ట్ కనెక్టివిటి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. నిస్సాన్ తొలిసారిగా తమ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్‌లో 6.2-అంగుళాల పరిమాణం ఉన్న ఆడియో విజువల్ న్యావిగేషన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

Recommended Video

Volkswagen Launches Tenth Anniversary special Editions | In Telugu - DriveSpark తెలుగు
నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్‌ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ స్పోర్టివ్ స్టైలింగ్ లక్షణాలు ఉన్నాయి. అందులో, కారుకు ఇరువైపులా స్పోర్టివ్ సైడ్ డీకాల్స్, ఆరేంజ్ కలర్ తొడుగులు గల బ్లాక్ వీల్ కవర్స్, మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద బోల్డ్ డిజైన్ ఆరేంజ్ స్ట్రిప్స్ ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ ఇంటీరియర్‌లో బ్లాక్ పియానో మరియు ఆరేంజ్ కలర్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఆరేంజ్ కలర్ దారంతో కుట్టబడిన యూరోపియన్ బ్లాక్ కలర్ సీట్లు, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్లు, బెనిటెన్ సిగ్నేచర్ గల డిజైనర్ హెడ్ రెస్ట్ కవర్స్ ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ మైక్రా ఎక్స్ఎల్ సివిటి మోడల్ ఆధారంగా రూపొందించారు. ఇందులో సాంకేతికంగా, 1.2-లీటర్ సామర్థ్యం గల 76బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది ఏఆర్ఏఐ ప్రకారం లీటర్‌కు 19.34కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్‌లో అదనంగా బెనిటెన్ పర్శనల్ యాక్ససరీలు లభించనున్నాయి. బెల్ట్, మెన్ మరియు ఉమెన్ కోసం డిజైనర్ వ్యాలెట్ లను ఫ్యాషన్ ఎడిషన్ మైక్రా లను ఎంచుకునే తొలి 500 మంది కస్టమర్లకు అందిస్తున్నారు. కస్టమర్లు 5 ఏళ్ల పొడగించబడిన వారంటీ ప్యాకేజ్ కూడా పొందవచ్చు.

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, "ఈ పండుగ సీజన్‌ విభిన్న స్టైలింగ్ డిజైన్‌లో హ్యాచ్‌బ్యాక్ ఎంచుకునే వారి కోసం మరియు అరుదైన మోడళ్లను కోరుకునే ప్రత్యేక కస్టమర్ల కోసం మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ విడుదల చేసినట్లు తెలిపాడు."

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ మైక్రా ఫ్యాషన్ ఎడిషన్ రెగ్యులర్ మోడల్ మైక్రాతో పోల్చుకుంటే స్టైలిష్ మరియు స్పోర్టివ్ శైలిలో ఉంది. దీనికి తోడు యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటిన్ డిజైనర్ వారి స్టైలింగ్ పనితనం ఫ్యాషన్ ఎడిషన్ మైక్రా మరింత అట్రాక్టివ్‌గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 13, 2017, 10:46 [IST]
English summary
Read In Telugu: nissan micra fashion edition launched in india- launch price mileage specifications images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+