2017 మైక్రా హ్యాచ్‌బ్యాక్ విడుదల చేసిన నిస్సాన్: ఫీచర్లు, ధరలు మరియు స్పెసిఫికేషన్లు

నిస్సాన్ ఇండియా తమ 2017 మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు నిస్సాన్ పేర్కొంది.

By Anil

నూతన ఫీచర్లు, అప్‌గ్రేడ్స్ మరియు అన్ని పెట్రోల్ వేరియంట్లలో సివిటి(ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ అందిస్తూ 2017 మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది నిస్సాన్.

2017 నిస్సాన్ మైక్రా విడుదల

2017 నిస్సాన్ మైక్రా నాలుగు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో రెండు పెట్రోల్ మరియు రెండు డీజల్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

2017 నిస్సాన్ మైక్రా వేరియంట్లు మరియు ధర వివరాలు

2017 నిస్సాన్ మైక్రా వేరియంట్లు మరియు ధర వివరాలు

  • ఎక్స్ఎల్ పెట్రోల్(సివిటి) ధర రూ. 5.99 లక్షలు
  • ఎక్స్ఎల్ డీజల్ ధర రూ. 6.62 లక్షలు
  • ఎక్స్‌వి పెట్రోల్ (సివిటి) ధర రూ. 6.95 లక్షలు
  • ఎక్స్ఎల్ కంఫర్ట్ డీజల్ ధర రూ. 7.23 లక్షలు
  • గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
    2017 నిస్సాన్ మైక్రా విడుదల

    2017 నిస్సాన్ మైక్రాలోని పెట్రోల్ వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది 76బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది లీటర్‌ పెట్రోల్‌కు 19.34కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

    2017 నిస్సాన్ మైక్రా విడుదల

    నిస్సాన్ మైక్రాలోని డీజల్ వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 63బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. మరియు ఇది లీటర్‌కు 23.08కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

    మైలేజ్ వివరాలు ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం ఇవ్వబడ్డాయి.

    2017 నిస్సాన్ మైక్రా డిజైన్ మరియు కొత్త ఫీచర్లు

    2017 నిస్సాన్ మైక్రా డిజైన్ మరియు కొత్త ఫీచర్లు

    2017 నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే అదనంగా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి. మరియు పార్కింగ్ లాట్‌లో ఉన్న కారు వద్దకు వెళ్లడానికి స్మార్ట్ కీ ద్వారా లీడ్ మి టు కార్ ఫీచర్‌తో డ్రైవర్ తన కారును సులభంగా గుర్తించవచ్చు.

    2017 నిస్సాన్ మైక్రా విడుదల

    పియానో బ్లాక్ ఫినిషింగ్ మరియు సరికొత్త యూరోపియన్ బ్లాక్ థీమ్ జోడింపుతో ఇంటీరియర్‌ను రూపొందించారు. దీనికి అదనంగా ఆరేంజ్ కలర్ సొబగులతో సీట్లు, డ్యాష్ బోర్డ్ మరియు ఆర్మ్ రెస్ట్ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి.

    2017 నిస్సాన్ మైక్రా విడుదల

    డ్యాష్ బోర్డ్ మీద బ్లూటూత్ సపోర్ట్ గల సరికొత్త 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్ వంటి ఫీచర్లతో మరిన్ని ఇతర ఫీచర్లు ఉన్నాయి.

    2017 నిస్సాన్ మైక్రా విడుదల

    సరికొత్త 2017 నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారును ఏడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు: అవి, బ్రిక్ రెడ్, టర్కోయిస్ బ్లూ, బ్లేడ్ సిల్వర్, ఆంక్సీ బ్లాక్, నైట్ షేడ్, స్టార్మ్ వైట్ మరియు సన్ షైన్ ఆరేంజ్.

Most Read Articles

English summary
Read In Telugu Nissan Micra Launched In India; Prices Start At Rs 5.99 Lakhs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X