TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ కారు: నిస్సాన్ నోట్ ఇ-పవర్
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చి, ప్రపంచ విపణిలో సంచలనాలు సృష్టించిన నిస్సాన్ నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో విడుదలకు రూట్ క్లియర్ చేసుకుంటోంది.
2030 నాటికి అన్ని కార్ల తయారీ సంస్థలు కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించేలా మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉంది. అయితే జపాన్ దిగ్గజం ఇప్పుడే తమ నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కారును ఇండియాకు ఎందుకు తీసుకొస్తోందో తెలుసా....? నిస్సాన్ వినియోగించిన టెక్నాలజీ మరియు భారత్ మీద నిస్సాన్‌కు ఉన్న ప్లాన్ చూస్తే దిగ్గజాల దిమ్మ తిరగడం ఖాయం...
నిస్సాన్ నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కారులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ?
నిస్సాన్ తమ నోట్ ఇ-పవర్ కారులో 1198సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది ఎలక్ట్రిక్ కారు పరిది విస్తరిణిగా పనిచేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ కార్లకు పరిమిత కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. కాని ఇందులో అలా కాకుండా ఎంత దూరం ప్రయాణించాలంటే అంత దూరం పాటు ప్రయాణ పరిధిని పెంచుకోవచ్చు.


ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ కారు
నిజానికి ఎలక్ట్రిక్ కార్లలో ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. అయితే, నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ సాకెట్ ఉండదు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యి, కారు ఎలక్ట్రిక్ మోటార్ మీద నడుస్తుంది.
ప్రయాణ పరిధిని ఎలా పెంచుకోవచ్చు...?
సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క సారి ఛార్జింగ్‌తో కేవలం ఇన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలం దీనిని రేంజ్(పరిధి) అంటాము. అయితే కారులోని ఇంజన్ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తుంది కాబట్టి. పెట్రోల్ నింపుకునే కొద్దీ ఛార్జింగ్ పెరిగి, వీలైనంత దూరం ప్రయాణించవచ్చు.
బ్యాటరీని ఛార్జ్ చేసే పెట్రోల్ ఇంజన్
నిజానికి హైబ్రిడ్ కార్లలో ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. అయితే నిస్సాన్ ఇందులో అందించిన పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ చక్రాలకు అందదు. పెట్రోల్ ఇంజన్ ద్వారా వచ్చే పవర్‌తో బ్యాటరీ చార్జ్ అవుతుంది. బ్యాటరీ పవర్ సహాయంతో ఎలక్ట్రిక్ మోటార్లు కారును డ్రైవ్ చేయడానికి సహాయపడతాయి.
నిస్సాన్ నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కారును తొలుత 2016 లో జపాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదలైన కొంత కాలానికే దీనికి భారీ స్పందన లభించింది. 2017 ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగిన నోట్ ఇ-పవర్ కారు విక్రయాలతో జపాన్ రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
భారత్‌లోకి నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కార్ల రాక
నిస్సాన్ భారత్‌లోకి అతి త్వరలో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు పైలట్ ప్రాజెక్ట్ క్రింది కొన్ని యూనిట్లను విడుదల చేయనున్నట్లు నిస్సాన్ వెల్లడించింది. నిస్సాన్ లీఫ్ మరియు నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కార్లను పరీక్షించాలని నిస్సాన్ ఇండియా విభాగాన్ని ఆదేశించినట్లు నిస్సాన్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ షెల్లాచి తెలిపాడు.
2030 నాటికి దేశీయంగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని నిస్సాన్ తమ లీఫ్ మరియు నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కార్లను భారత విపణిలోకి ప్రవేశపెట్టడానికి ఆసక్తికనబరుస్తోంది.
నిస్సాన్ మొత్తం కార్ల విక్రయాల్లో 70 శాతం వాటా నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కార్లు సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా జపాన్ వంటి అత్యంత అభివృద్ది చెందిన దేశంలోనే నోట్ ఇ-పవర్ కారుకు భారీ డిమాండ్ లభిస్తుండటంతో ఇండియాలో కూడా ఇదే తరహా విజయం సాధ్యమవుతుందని నిస్సాన్ ఆశిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నిస్సాన్ ఇండియా విపణిలోకి నోట్ ఇ-పవర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడాన్ని, ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌కు ఒక శుభ సూచకం అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ స్టేషన్‌తో అవసరం లేకపోవడం, పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్రోల్ నింపుకోవచ్చు. దీంతో నిస్సాన్ నోట్ ఇ-పవర్ సక్సెస్ ఖాయం అని చెప్పవచ్చు.