బాలెనో మరియు ఐ20 లకు నిఖార్సయిన పోటీని తెస్తున్న నిస్సాన్
ఇండియన్ మార్కెట్లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లంటే ముందుగా గుర్తొచ్చేవి మారుతి బాలెనో హ్యుందాయ్ ఐ20.
ఇండియన్ మార్కెట్లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లంటే ముందుగా గుర్తొచ్చేవి మారుతి బాలెనో హ్యుందాయ్ ఐ20. ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న బాలెనో, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే మోడల్‌ను నిస్సాన్ పరిచయం చేయనుంది.

నిస్సాన్ ఇండియా తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ నోట్ ఇ-పవర్ కారును తమిళనాడులోని చెంగల్‌పట్టు సమీపంలో రహస్యంగా పరీక్షించింది. నిస్సాన్ నోట్ ఇ-పవర్ గురించి మరిన్ని వివరాలు నేటి కథనంలో....

రెగ్యులర్ వెర్షన్ నోట్ ఇ-పవర్ యొక్క రేంజ్ ఎక్స్‌టెండెడ్ మోడల్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. నోట్ ఇ-పవర్ టెస్టింగ్ ఫోటోలు కూడా ఇది మిడిల్ వేరియంట్ అని సూచిస్తున్నాయి. పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు నిస్సాన్ సిగ్నేచర్ వి-మోషన్ ఫ్రంట్ గ్రిల్ కలదు.
Recommended Video


సాంకేతికంగా నిస్సాన్ నోట్ ఇ-పవర్ హ్యాచ్‌బ్యాక్ కారు మూడు సిలిండర్ల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. అయితే, ఈ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ కారు నడవడానికి కాకుండా కారులోని బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది.

ఇలా చార్జ్ అయిన బ్యాటరీలు కారు మొత్తం ఎలక్ట్రిక్ సిస్టమ్ మీద నడవడానికి ఉపయోగపడుతుంది. అంటే, నోట్ ఇ-పవర్ కారు నిజానికి ఎలక్ట్రిక్ కారే అయితే, దీనిని ఛార్జ్ చేయడానికి చార్జింగ్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేదు. కారులో ఉన్న పెట్రోల్ ఇంజన్ ఎప్పటికప్పుడు కారులోని బ్యాటరీలను చార్జ్ చేస్తుంటుంది.

ఇంట్లో కారును చార్జ్ చేసుకునే వెళ్లే కార్ల పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మార్గం మధ్యలో ఛార్జింగ్ అయిపోతే అంతే సంగతులు. ఇలాంటిది జరగకుండా ఉండేదుకు కారులో ఛార్జింగ్ అయిపోయే సమయంలో పరిధిని పెంచడానికి పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి, కారును ఛార్జ్ చేస్తుంది. అందుకే దీనిని రేంజ్ ఎక్స్‌టెండెడ్ మోడల్ అంటారు.
Trending On DriveSpark Telugu:

నిస్సాన్ నోట్ ఇ-పవర్ హ్యాచ్‌బ్యాక్ లీటర్‌కు 37కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే భారతదేశంలోనే అత్యధిక మైలేజ్ ఇవ్వగల పెట్రోల్ కారుగా నిలవనుంది. అయితే, ఇలాంటి హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెట్రోల్ మరియు డీజల్ కార్ల కంటే ఎక్కువగా ఉంది.

ఇండియాలో ఎప్పటి వరకు రేంజ్ ఎక్స్‌టెండర్ కార్లు లేవు. మరియు నిస్సాన్ నోట్ ఇ-పవర్ ఒక విభిన్నమైన మోడల్. నోట్ ఇ-పవర్ కారుతో పాటు నిస్సాన్ లీఫ్ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే ఆలోచనలో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నిజానికి, నిస్సాన్ నోట్ ఇ-పవర్ కారును ఎలక్ట్రిక్ కార్ అని చెప్పలేం, హైబ్రిడ్ కారు అని చెప్పలేం. అయితే, భారతప్రభుత్వం దీనిని ఎలా పరిగణిస్తోందో... ఎలాంటి ట్యాక్స్ నిర్ణయిస్తుందో వేచి చూడాలి మరి. ఈ నోట్ ఇ-పవర్ కారును పూర్తి స్థాయిలో లాంచ్ చేయడానికి ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ ఫ్లాట్‌ఫామ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. కాబట్టి ఇది మంచి సక్సెస్ అందుకోవచ్చు.
నిస్సాన్ నోట్ ఇ-పవర్ గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి...
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








