నిస్సాన్ సన్నీ కారును కొనడానికి సరైన సమయం ఇదే: భారీగా తగ్గిన ధరలు

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా విభాగం తమ ఫ్లాగ్‌షిప్ సెడాన్ సన్నీ ధరలను సవరించింది. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్నీ కొత్త ధరలు ఏప్రిల్ 20, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు నిస్సాన్ తెలిపింది.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

ప్రస్తుతం విపణిలో ఉన్న సాధారణ కాంపాక్ట్ సెడాన్ సగటు ధరతో ఇప్పుడు ఈ నిస్సాన్ సన్నీ సెడాన్‌ను ఎంచుకోవచ్చు. నిస్సాన్ సన్నీ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

నిస్సాన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ సన్నీ సెడాన్‌ను చెన్నైలోని తమ ఒరగడం ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. మేడిన్ ఇండియా చొరవతో అన్ని విడి భాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేయడం సన్నీ ధరలు తగ్గడానికి కారణమయ్యింది.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

2017 నిస్సాన్ సన్నీ సెడాన్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

అదే విధంగా నిస్సాన్ సన్నీ డీజల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభిస్తోంది.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

భద్రత పరంగా సన్నీ సెడాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటివి కలవు. నిస్సాన్ డీజల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 22.71కిలోమీటర్లుగా ఉంది.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద భారీగా తగ్గిన ధరలు

2017 సన్నీ సెడాన్ కారులో క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ కలదు. 2017 ఎడిషన్ సన్నీ శాండ్ స్టోన్ బ్రౌన్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులోకి వచ్చింది.

నూతన సన్నీ వేరియంట్ల వారీగా ధరలు

నూతన సన్నీ వేరియంట్ల వారీగా ధరలు

  • సన్నీ ఎక్స్ఇ పెట్రోల్ ధర రూ. 6.99 లక్షలు
  • సన్నీ ఎక్స్ఎల్ పెట్రోల్ ధర రూ. 7.59 లక్షలు
  • సన్నీ ఎక్స్‌వి ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 8.99 లక్షలు
  • సన్నీ ఎక్స్ఇ డీజల్ ధర రూ. 7.49 లక్షలు
  • సన్నీ ఎక్స్ఎల్ డీజల్ ధర రూ. 7.99 లక్షలు
  • సన్నీ ఎక్స్‌వి డీజల్ ధర రూ. 8.99 లక్షలు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
 
English summary
Read In Telugu To Know About Nissan Sunny Prices Updated In India
Story first published: Saturday, April 22, 2017, 10:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark