22 నూతన ఫీచర్లతో ఫేస్‌లిఫ్ట్ టెర్రానో విడుదల చేసిన నిస్సాన్: ధర రూ. 9.99 లక్షలు

Written By:

నిస్సాన్ నేడు(27 మార్చి, 2017) మార్కెట్లోకి శక్తివంతమైన టెర్రానో ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త ఫేస్‌లిఫ్ట్ టెర్రానో ఎస్‌యీవీలో నిస్సాన్ సుమారుగా 22 కొత్త ఫీచర్లను అందించింది. అంతే కాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఇందులో కలదు.

ధర వివరాలు

ధర వివరాలు

నిస్సాన్ ఇండియా తమ ఫేస్‌లిఫ్ట్ టెర్రానో ఎస్‌యూ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.95 లక్షలు ఎక్స్‌-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో మునుపటి అదే 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 102బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడం జరిగింది.

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లో కూడా లభిస్తుంది. ఇది రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయును.

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్

మొదటి పద్దతిలో 84బిహెచ్ మరియు 200ఎన్ఎమ్ అదే విధంగా రెండవ పద్దతిలో 108బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

డీజల్‌లోని తక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా ఎక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే వేరియంట్లో 6-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లలో లభించును. డీజల్ వేరియంట్ గరిష్టంగా 19.64 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇవ్వగలదు.

సరికొత్త టెర్రానో ఫేస్‌లిఫ్ట్ లోని ఫీచర్లు...

సరికొత్త టెర్రానో ఫేస్‌లిఫ్ట్ లోని ఫీచర్లు...

ఫేస్‌లిఫ్ట్ టెర్రానో ఎస్‌యూవీలోని ఇంటీరియర్‌లో 22 మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో నూతన క్రోమ్ పరికరాలు, సరికొత్త డోర్ ట్రిమ్స్, ఆడియో కంట్రోల్స్ గల నూతన స్టీరింగ్ వీల్, డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్లు కలవు.

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్

ఇతర ప్రధాన మార్పుల్లో 7-అంగుళాల తాకే తెర ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ డిస్ల్పే, ఇది బ్లూటూత్ మరియు న్యావిగేషన్ సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్ టచ్ పెయింట్ చేయబడిన డ్యాష్ బోర్డ్ కలదు.

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా నిస్సాన్ తమ టెర్రానో ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (అన్ని వేరియంట్లోల స్టాండర్డ్‌గా), ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, ఎయిర్ బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్ మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించింది.

నిస్సాన్ టెర్రానో ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ నిస్సాన్ టెర్రానో శాండ్‌స్టోన్ బ్రౌన్ అనే నూతన ఎక్ట్సీరియర్ కలర్‌లో లభించును. ఇందులో అధునాతన అల్లాయ్ వీల్స్ అందివ్వడం జరిగింది.

.

సరికొత్త హోండా డియో స్కూటర్ విడుదల: ధర, మైలేజ్ ఫీచర్లు...

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లోకి 2017 డియో స్కూటర్ విడుదల చేసింది. సరికొత్త డియో గురించి మరిన్ని విడుదల వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

 
English summary
Also Read In Telugu: Nissan Terrano Facelift Launched In India; Prices Start At Rs 9.99 Lakh
Story first published: Monday, March 27, 2017, 15:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark