కిక్స్ ఎస్‌యూవీని ఇండియా విడుదలకు సిద్దం చేస్తున్న నిస్సాన్

Written By:

స్సాన్ గత ఏడాది బ్రెజిల్‌లో జరిగిన మోటార్ షో ఆధారంగా కిక్స్ ఎస్‌యూవీని అంతర్జాతీయ ప్రదర్శన చేసింది. ఇప్పుడు జపాన్‌కు చెందిన ఈ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ తమ కిక్స్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి 2018 మూడవ త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఇండియాకు రానున్న కిక్స్ ఎస్‌యూవీని పిబి1డి కోడ్ పేరుతో త్వరలో విడుదల కానున్న రెనో క్యాప్చర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. రెనో యొక్కబాగా నిరూపించబడిన ఎమ్ఒ ఫ్లాట్‌ఫామ్ యొక్క మోడిఫైడ్ వెర్షన్ ఫ్లాట్‌ఫామ్‌తో కిక్స్‌ను డెవలప్ చేసారు. ఇదే వేదిక మీద డస్టర్ మరియు లాజీ వంటివి వచ్చాయి.

రెనో-నిస్సాన్ యొక్క భాగస్వామ్యంలోని కామన్ మాడ్యుల్ ఫ్యామిలీ(CMF-B) ఫ్లాట్‌ఫామ్ యొక్క మొదటి ఎస్‌యూవీ కిక్స్. దేశీయంగా మంచి విజయం సాధించాలంటే దాదాపు అన్ని విడి భాగాలను దేశీయంగానే సేకరించాల్సి ఉంటుంది. అందుకోసం లోకల్‌గా దీనిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ డిజైన్ విషయానికి వస్తే, గత ఏడాది కాన్సెప్ట్ దశలో ప్రదర్శించబడిన మోడల్ తరహాలోనే ఉంది. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇంటీరియర్‌లో ప్రధానంగా విభిన్న లేయర్ల డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, లెథర్ సీట్లు, ప్లష్ డోర్ ట్రిమ్స్ ఇందులో ఉన్నాయి.

మల్టీమీడియా కోసం 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ వ్యూవ్ మానిటర్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ ఫంక్షన్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొలతల పరంగా నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ యొక్క పొడవు 4,295ఎమ్ఎమ్, వెడల్పు 1,760ఎమ్ఎమ్, ఎత్తు 1,590ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,610ఎమ్ఎమ్ కలదు, 5 మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం కలదు.

సాంకేతికంగా కిక్స్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న కె9కె డీజల్ ఇంజన్ కలదు. వినియోగించి మరియు పరీక్షించిన రెనో నుండి ఈ ఇంజన్‌ను నిస్సాన్ సేకరించింది. ఈ ఇంజన్ 83 మరియు 107 రెండు స్థితులలో పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఓవరాల్‌గా గమనిస్తే, ఇది నిస్సాన్ యొక్క టెర్రానో రీప్లెస్‌మెంట్ అని చెప్పవచ్చు. నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, హోండా బిఆర్-వి మరియు రెనో డస్టర్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Nissan Kicks India Launch Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos