నీటితో పనిలేకుండా కార్ క్లీనింగ్: వాటర్ లెస్ క్లీనింగ్ ప్రారంభించిన నిస్సాన్

Written By:

హ్యాపీ విత్ నిస్సాన్ అనే కార్యక్రమంలో భాగంగా నిస్సాన్ వాటర్ లెస్ క్లీనింగ్‌ను ప్రారంభించింది. నిస్సాన్ నిర్వహిస్తున్న "హ్యాపీ విత్ నిస్సాన్" ఏడవ ఎడిషన్‌లో భాగంగా గుర్గావ్‌లోని నిస్సాన్ విక్రయ కేంద్రంలో బాలీవుడు నటుడు మరియు నిస్సాన్ బ్రాండ్ అంబాసిడర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సమక్షంలో వాటర్ లెస్ కార్ క్లీనింగ్ ప్రారంభించారు.

ఏడవ ఎడిషన్ హ్యాపీ విత్ నిస్సాన్ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా ఉన్న 148 నిస్సాన్ మరియు డాట్సన్ డీలర్ల వద్ద ఆగష్టు 17 నుండి 24 వరకు జరగనుంది.

నీటితో పనిలేకుండా కార్ క్లీనింగ్

కార్లను కడగాలనుకునే కస్టమర్లు వాటర్ లెస్ క్లీనింగ్ కోసం నిస్సాన్ ప్రవేశపెట్టిన సొల్యూషన్‌ను కారు మీద అప్లే చేయడం ద్వారా నీటి అవసరం లేకుండానే కారు శుభ్రంగా కనిపిస్తుంది. నీటికి ప్రత్యమ్నాయంగా కనిపెట్టిన ఈ పరిష్కారం ద్వారా ఏడాదికి 1300 లక్షల లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
నీటితో పనిలేకుండా కార్ క్లీనింగ్

హ్యాపీ విత్ నిస్సాన్ క్యాంపెయిన్‌లో భాగంగా 60-పాయింట్ ఫ్రీ చెకప్, యాక్ససరీల మీద డిస్కౌంట్లను అందించింది. నిస్సాన్ సర్వీసింగ్ కేంద్రాలలో సర్వీస్ చేయించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి నిస్సాన్ కస్టమర్లతో పంచుకుంది.

నీటితో పనిలేకుండా కార్ క్లీనింగ్

నిస్సాన్ కస్టమర్లకు ప్రయోజనకరమైన వాటర్ లెస్ కార్ క్లీన్ పరిష్కారాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా నగదు రహిత లావాదేవీలు జరిపే వారికి వీలుగా ఉండేందుకు పేటిఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కస్టమర్లు డీలర్ల వద్ద పేటిఎమ్ వినియోగించిన క్యాస్ లెస్ ట్రాక్షన్స్ నిర్వహించవచ్చు.

English summary
Read In Telugu: Nissan Launches ‘Waterless Car Cleaning’ As Part Of Happy With Nissan Campaign
Story first published: Friday, August 18, 2017, 10:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark