ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే మూడు నెలలు జైలు

మీరు మీ వెంట ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లకపోతే రూ. 500 జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలు శిక్షపడే అవకాశం ఉంది.

By Anil

వెహికల్ నడుపుతున్నపుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ వెంట ఉంచుకోండి. మద్రాసు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ వర్గీకరణ పరంగా సెప్టెంబర్ 5, 2017 నుండి వాహన చోదకులందరూ తమ
అసలైన డ్రైవింగ్ లైసెన్సులను తప్పకుండా తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

అయితే, పోలీసులు వాహన చోదకుల లైసెన్సులు అసలైనవేనా కాదా.... అని మాత్రమే నిర్ధారించాలి. అయితే డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు తమ చేతికి తీసుకోవడాన్ని నిరాకరిస్తూ మద్రాసు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికి ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

ప్రస్తుతం చాలా మంది జిరాక్స్ కాపీ లైసెన్సులను మాత్రమే వెంట తెచ్చుకుంటున్నారు, అయితే నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ లను వినియోగించే వారి లైసెన్సులను రద్దు చేసేందుకు సెప్టెంబర్ 1, 2017 నుండి కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చినట్లు తమిళనాడు రవాణా శాఖ మంత్రి ఎమ్ఆర్ విజయభాస్కర్ పేర్కొన్నాడు.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

సెప్టెంబర్ 1, 2017 నుండి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సులను వెంట ఉంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తిరస్కరిస్తూ, దీనిని సెప్టెంబర్ 5, 2017 నుండి అమలు చేయాలని తొలి డివిజన్ బెంచ్ మరియు న్యాయమూర్తి ఎమ్ సుందర్ వెల్లడించారు.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

సెప్టెంబర్ 1, 2017 నుండి డ్రైవింగ్ లైసెన్సుల కొత్త విధానం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు లారీ ఓనర్ల ఫెడరేషన్ పిటిషన్‌ వేయగా, సెప్టెంబర్ 5, 2017 వరకు కాకుండా దానికి ముందే కొత్త నియమాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ పేర్కొన్నాడు.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

అయితే వాదనలన్నింటికీ తెరదించుతూ, సెప్టెంబర్ 5, 2017 నుండి వాహన చోదకులు తమ వెంట అసలైన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి, అయితే డ్రైవింగ్ లైసెన్స్ నిర్ధారణకు మినహాయిస్తే పోలీసులు వాహన చోదకుల నుండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకూడదని మంద్రాస్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ స్పష్టం చేశారు.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

అంతే కాకుండా మీరు మీ వెంట ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లకపోతే రూ. 500 జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలు శిక్షపడే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ గురించి తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుల సెప్టెంబర్ 5, 2017 తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో సంభందింత అధికారులు విఫలమవుతుంటారు. అయితే మన వెంట ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవడం వలన నకిలీ లైసెన్సుల వినియోగించే వారు సులభంగా బయటపడతారు.

అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్న మన దేశంలో ఇలాంటి నకిలీ లైసెన్స్‌లను ఏరివేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు టెక్నాలజీ సహాయంతో నకిలీ లైసెన్సులను రద్దు చేస్తే, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 6, 2017, 10:53 [IST]
English summary
Read In Telugu: Original Driving License To Be Carried From Now On: Madras HC
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+