పెట్రోల్ మరియు డీజల్ ధరలపై తీపి కబురు!
వరుసగా నాలుగు వారాల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఈ సారి పెట్రోల్ మరియు డీజల్ మీద దాదాపుగా ఒకే విధమైన తగ్గింపును ప్రకటించారు.
తాజాగా చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో డీజల్ మీద రూ. 2.16 లు మరియు పెట్రోల్ మీద రూ. 2.10 లు తగ్గాయి. ఇంధన ధరలు తగ్గించిన అనంతరం నూతన ధరలు నేటి అర్థరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.

మునుపటి పెట్రో ధరల సవరణ గురించి చూస్తే, లీటర్ పెట్రోల్ మీద రెండు పైసలు మరియు లీటర్ డీజల్ మీద 52 పైసల మార్జిన్ ధరలను మే 1 వ తారీఖున పెంచాయి.

మే 1 రోజుకు పదిహేను రోజుల ముందు అంటే ఏప్రిల్ 16 తేదీన కూడా చమురు సంస్థలు ధరల సవరణ చేపట్టాయి. అప్పుడు కూడా లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.04 ల వరకు ధరలు పెంచారు.

భారత దేశపు అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర పన్నులతో కలుపుకుని పెట్రోల్ మీద రూ. 2.16 లు మరియు డీజల్ మీద రూ. 2.10 లు తగ్గింపుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నిజానికి ఇంధన ధరలు ఇంతకన్నా ఎక్కువ మేరే తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రాల విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) కారణంగా పెంపు స్వల్పంగా ఉంది.

ప్రస్తుతం కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 65.32 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 54.90 లుగా అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








