జస్ట్ 2.31 కోట్ల రుపాయల ధరతో పోర్షే 911 జిటి3 సూపర్ కారు విడుదల

పోర్షే 911 జిటి3(Porsche 911 GT3)సూపర్ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త పోర్షే 911 జిటి3 కారు ధర రూ. 2.31 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil

పోర్షే 911 జిటి3(Porsche 911 GT3)సూపర్ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త పోర్షే 911 జిటి3 కారు ధర రూ. 2.31 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. పోర్షే 911 జిటి3(991.2) కారును మొట్టమొదటి సారిగా 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది.

పోర్షే 911జిటి3

పోర్షే 911 జిటి3 లో 4.0-లీటర్ సామర్థ్యం గల ఫ్లాట్ ఆరు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 911 జిటి3 లోని శక్తివంతమైన ఇంజన్ 8,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 493బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 460ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే 911జిటి3

కారుకు వెనుక భాగంలో అమర్చిన ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ పిడికె ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

Recommended Video

2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
పోర్షే 911జిటి3

పోర్షే 911 జిటి3 సూపర్ కారు కేవలం 3.4-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు గరిష్ట వేగం గంటకు 318కిలోమీటర్లుగా ఉంది. అయితే, 911 జిటి3 మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్ 3.9 సెకండ్ల వ్యవధిలో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రెండింటి మధ్య 100కిమీల వేగాన్ని అందుకోవడంలో 5 సెకండ్ల వ్యత్యాసం ఉంది.

పోర్షే 911జిటి3

పోర్షే 911 జిటి3 లో రియర్ యాక్సిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్యాంపర్ సిస్టమ్ మరియు డైనమిక్ ఇంజన్ మౌంట్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి. కారు వెనుక భాగం మొత్తం కార్బన్ ఫైబర్ కార్బన్‌తో నిర్మించబడింది. ఇందులో సెంటర్ లాకింగ్ వీల్స్ ఫీచర్‌తో పాటు మోటోస్పోర్ట్ అభివృద్ది చేసిన ఛాసిస్ కలదు.

పోర్షే 911జిటి3

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సూపర్ కార్లంటే అందరూ డ్రైవింగ్ మీద దృష్టిపెడతారు. అందుకోసం దాదాపు అన్ని కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. అయితే, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను విపరీతంగా ప్రేమించే ఇండియన్స్ కోసం పోర్షే తమ 911 జిటి3లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, October 9, 2017, 16:32 [IST]
English summary
Read In Telugu: Porsche 911 GT3 Launched In India At Rs 2.31 Crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+