పోర్షే పానమెరా విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు...

ఖరీదైన కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియన్ మార్కెట్లోకి సుమారుగా రెండు కోట్ల రుపాయల ఖరీదైన పానమెరా టుర్బో కారును విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు...

By Anil

పోర్షే దేశీయ విపణిలోకి పానమెరా టుర్బో కారును అధికారికంగా విడుదల చేసింది. పోర్షే పానమెరా టుర్బో ధర రూ. 1.96 కోట్లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు...

పోర్షే పానమెరా టుర్బో

సాంకేతికంగా పోర్షే పానమెరా టుర్బో కారులో 4.0-లీటర్ సామర్థ్యం గల వి8 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 543బిహెచ్‌పి పవర్ మరియు 770ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పోర్షే పానమెరా టుర్బో

సరికొత్త పోర్షే పానమెరా టుర్బో కేవలం 3.8 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్టం వేగం గంటకు 308కిలోమీటర్లుగా ఉంది.

డిజైన్

డిజైన్

డిజైన్ పరంగా సరికొత్త పానమెరా టుర్బో మునుపటి మోడల్ కన్నా మరింత పదునుగా మరియు ఆకర్షణీయంగా ఉంది. ఫ్రంట్ డిజైన్‌లో స్పోర్టివ్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సరికొత్త ఎయిర్ ఇంటేకర్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ కలదు.

పోర్షే పానమెరా టుర్బో

రియర్ డిజైన్‌లో టెయిల్ ల్యాంప్స్‌ను 718 కేమాన్ వేరియంట్ నుండి సేకరించడం జరిగింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అత్యుత్తమ రియర్ డిజైన్‌ను సరికొత్త పానమెరాలో టుర్బో గుర్తించవచ్చు.

పోర్షే పానమెరా టుర్బో

పానమెరా టుర్బో ఇంటీరియర్‍‌ పూర్తీగా టెక్నాలజీ మరియు లగ్జరీ ఫీచర్లతో నిండి ఉండి లెథర్ అప్‌హోల్‌స్ట్రే కలిగి ఉంది. మరియు 12.3-అంగుళాల పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్(PCM) ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు.

పోర్షే పానమెరా టుర్బో

భద్రత పరంగా సరికొత్త పానమెరా టుర్బో కారులో టర్న్ అసిస్ట్ అనుసంధానిత అడాప్టివ్ లేన్ చేంజ్ అసిస్ట్, రహదారి గుర్తులను గుర్తించే లేన్ కీపింగ్ అసిస్ట్, కార్నరింగ్ నోటిఫికేషన్, పార్క్ అసిస్ట్, వెనుక వైపు చుట్టూ గమనించగల రివర్స్ కెమెరా కలదు.

More from DriveSpark

Article Published On: Thursday, March 23, 2017, 17:54 [IST]
English summary
Porsche Panamera Turbo Launched In India; Priced At Rs 1.96 Crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+