షాకింగ్: రెనో కప్తుర్ లక్ష్యం మహీంద్రా ఎక్స్‌యూవీ500 అంటూ వ్యాఖ్యలు
కప్తుర్ ఎస్‌యూవీ, ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 కు పోటీగా వస్తోందని రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ సుమిత్ సాహ్నే వ్యాఖ్యానించాడు.
రెనో ఇండియా అతి త్వరలో విడుదల చేయనున్న కప్తుర్ ఎస్‌యూవీ, ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 కు పోటీగా వస్తోందని రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ సుమిత్ సాహ్నే వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం రెనో ఇండియా లైనప్‌లో డస్టర్ ఎస్‌యూవీ మరియు లాజీ ఎమ్‌పీవీ వాహనాలు మాత్రమే పెద్ద ప్యాసింజర్ వెహికల్స్‌గా ఉన్నాయి. ఈ రెండింటి కన్నా పెద్ద పరిమాణంలో ఉన్న కప్తుర్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు జీప్ కంపాస్‌తో పాటు ఈ శ్రేణిలో ఉన్న ఎస్‌యూవీలకు సరాసరి పోటీనివ్వనుంది.
Recommended Video


క్రాస్-ఓవర్ డిఎన్‌ఎ లక్షణాలతో రెనో అభివృద్ది చేసిన 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లగ్జరీ మరియు ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో వస్తున్నట్లు కప్తుర్ గురించి సుమిత్ వివరించాడు. డస్టర్ పై స్థానాన్ని భర్తీ చేయనున్న కప్తుర్ ను రెనో చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

ప్రస్తుతం రెనో అంతర్జాతీయ విపణిలో ఈ ఎస్‌యూవీని క్యాప్చర్(Capture) పేరుతో అందుబాటులో ఉంచింది. అయితే, అవే డిజైన్ లక్షణాలు మరియు ఇంజన్ ఆప్షన్‌లతో రష్యా మరియు ఇండియన్ మార్కెట్లోకి కప్తుర్(Kaptur) విడుదల చేయనుంది.

యూరోపియన్ మార్కెట్లో రెనో క్లియో ఆధారంగా దీనిని నిర్మిస్తే, ఇండియన్ మరియు రష్యన్ స్పెక్ కప్తుర్ ఎస్‌యూవీని డస్టర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తోంది. దీని విడుదల విషయానికి వస్తే, ఈ ఏడాదిలోని లాంచ్ చేస్తున్నట్లు రెనో ప్రకటించింది. అయితే, ఆక్టోబర్‌లో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

రెనో కప్తుర్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది. డస్టర్ తరహాలో 102బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 83బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజల్ మరియు 108బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఒకే రకమైన డీజల్ ఇంజన్ పవర్ రెండు రకాలుగా ప్రొడ్యూస్ చేస్తుంది.

రెనో కప్తుర్ ఫ్రంట్ డ్రైవ్ సిస్టమ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో ఎంచుకునే అవకాశాన్ని కల్పించనుంది. తొలుత అన్ని వేరియంట్లలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించి. కస్టమర్ల అవసరం మరియు డిమాండ్‌ను బట్టి, కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డిజైన్ మరియు ఫీచర్ల పరంగా రెనో కప్తుర్ మహీంద్రా ఎక్స్‌యూవీ500కి పోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే ఇంజన్ పరంగా కాస్త అనుమానాలు కలుగుతున్నాయి. కప్తుర్‌లో ఎక్స్‌యూవీ500 లో ఉన్నటువంటి శక్తివంతమైన్ ఇంజన్ అందించాల్సిన అవసరం ఉంటుంది.


Click it and Unblock the Notifications








