విడుదలకు ముందే కప్తుర్ ఎస్‌యూవీ వివరాలు వెల్లడించిన రెనో
ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో, దేశీయ విపణిలోకి తమ సరికొత్త కప్తుర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లన్ని పూర్తి చేసుకుంది.
ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో, దేశీయ విపణిలోకి తమ సరికొత్త కప్తుర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లన్ని పూర్తి చేసుకుంది. అయితే, విడుదలకు ముందే సెప్టెంబర్ 22, 2017 న కప్తుర్ ఎస్‌యూవీని ఆవిష్కరిస్తున్నట్లు రెనో అధికారికంగా ప్రకటించింది.

సెప్టెంబర్ 2017లో ఆవిష్కరించిన అనంతరం, కప్తుర్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించి, నంవంబరులో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఓ ఆన్‌లైన్ వార్తా వేదిక పేర్కొంది.

రెనో ఇండియా తమ కప్తుర్ ఎస్‌యూవీ విడుదలను సూచిస్తూ ఇప్పటికే పలుమార్లు ఫోటోలు మరియు వీడియోల రూపంలో కొన్ని టీజర్లను అధికారికంగా విడుదల చేసింది. దేశీయ ఎస్‍యూవీ సెగ్మెంట్లో, డస్టర్ పై స్థానంలో నిలవనున్న కప్తుర్ డిజైన్ మరియు ఇంటీరియర్ డిజైన్ ఎలిమెంట్లను టీజర్ల ద్వారా రెనో విడుదల చేసింది.

రెనో కప్తుర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ విపణిలో క్యాప్చర్ పేరుతో అందుబాటులో ఉంచింది. ఇండియన్ కప్తుర్ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో విడుదల కానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ లతో వీటిని ఎంచుకోవచ్చు.
Recommended Video


రెనో కప్తుర్‌లోని 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ రెండు రకాల పవర్ ఉత్పత్తి చేస్తుంది. అందులో ఒక యూనిట్ 79బిహెచ్‌పి, మరో యూనిట్ 108బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ సైడ్ డిజైన్‌లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మరియు ఇంటీరియర్‌లో 7-అంగుళాల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ వంటి అతి ప్రధానమైన ఫీచర్లతో పాటు మరిన్ని ఫీచర్లతో రానుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రెనో తొలిసారిగా డస్టర్‌ను విడుదల చేసి ఇండియన్స్‌కు కాంపాక్ట్ ఎస్‌యూవీ అంటే ఏంటో తెలియజేసింది. అయితే, ఇప్పుడు మరోసారి కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి తొలిసారి కప్తుర్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది.

రెనో కప్తుర్ క్రాసోవర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విడుదలైతే హ్యుందాయ్ క్రెటా మరియు జీప్ కంపాస్ వాహనాల నోర్లు మూయించనుంది. రూ. 11 లక్షల నుండి రూ. 16 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








