డస్టర్ మీద లక్ష రుపాయల వరకు తగ్గిన ధరలు
తాజాగా నూతన ట్యాక్స్ విధానం అమల్లోకి రావడంతో రెనో డస్టర్ మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు ధర తగ్గింది.
జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ విధానం జిఎస్‌టి ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. జిఎస్‌టి మేరకు సబ్ 4-మీటర్ ఎస్‌యూవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రెనో లైనప్‌లోని పాపులర్ మోడల్ డస్టర్ లోని అన్ని వేరియంట్ల మీద ధరలు తగ్గాయి. రెనో లోని ఎంచుకోదగ్గ మోడళ్ల మీద 7 శాతం వరకు ధరలు తగ్గాయి.

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియాకు మంచి గుర్తింపు లభించిందంటే అది కేవలం డస్టర్ ద్వారా మాత్రమే అని చెప్పాలి. దీని తర్వాత విడుదలైన క్విడ్ కూడా రెనో పేరును ఎంతో మందికి పరిచయం చేసింది.

ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి రెనో డస్టర్ విడుదలైన తొలినాళ్లలో భారీగా ఉండేవి. అయితే ఎకోస్పోర్ట్ మరియు వితారా బ్రిజా వాహనాల రాకతో డస్టర్ ప్రభావం అంతకంతకూ తగ్గిపోయింది. అయితే తాజాగా నూతన ట్యాక్స్ విధానం అమల్లోకి రావడంతో రెనో డస్టర్ మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు ధర తగ్గింది. రెనో లైనప్‌లోని క్విడ్ క్లైంబర్ ఆటోమేటిక్, డస్టర్ ఆర్ఎక్స్‌జడ్ మరియు లాజీ స్టెప్‌వే ఆర్ఎక్స్‌జడ్(7-సీటర్) ల మీద ధరల తగ్గింపు జరిగింది.

కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి అమలు చేయడం గురించి రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, " ప్రతిష్టాత్మక నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టిని భారత ప్రభుత్వం అమలు చేయడంతో గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా, ప్రారంభంలో జిఎస్‌టి భారం ఎక్కువగా అనిపించినప్పటికీ, జిఎస్‌టి వలన కలిగే లాభాలు ధీర్ఘకాలంలో కనిపిస్తాయని చెప్పుకొచ్చాడు."

రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జడ్ ఆల్‌వీల్ డ్రైవ్ వేరియంట్ మీద ధర రూ. 30,400 ల నుండి 1,04,000 ల వరకు తగ్గింది. తగ్గిన ధరలు వివిధ నగరాల మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. తగ్గించిన ధరలు ఢిల్లీ నగర ఆధారంగా అందివ్వడం జరిగింది.

రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జడ్ ఆల్‌వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 108.5బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.


Click it and Unblock the Notifications








