పాత ధరకే కొత్త ఫీచర్ల జోడింపుతో రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

రెనో ఇండియా విభాగం తమ డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ మీద ధరలు పెంచకుండానే ఇందులో కొన్ని అదనుపు ఫీచర్లను జోడించింది.

By Anil

రెనో డస్టర్ లోని ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ శుభవార్త. ఎలాంటి ధరల పెంపు లేకుండానే అనేక అదనపు ఫీచర్లను ఇందులో జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరి దీని ధర అదే విధంగా ఇందులో ఉన్న నూతన ఫీచర్లు ఏమిటో చూద్దాం రండి...

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

రెనో డస్టర్ లైనప్‌లోని టాప్ ఎండ్ వేరియంట్‌కు ఒక్క మెట్టు దిగువ స్థానంలో ఉంది. ఇందులో గన్ మెటల్ ఫినిషింగ్ గల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

రెనో డస్టర్ లోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆర్ఎక్స్‌జడ్ లో మాత్రమే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఉండేవి. అయితే వాటిని ఈ ఆర్ఎక్స్ఎస్ లో కూడా అందివ్వడం జరిగింది.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

రెనో తమ ఎంట్రీ లెవల్ క్విడ్ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడం ద్వారా అమ్మకాలు భారీగా పెరిగాయి. తద్వారా ధరకు తగ్గ విలువలతో ఉన్న ఉత్పత్తుల్లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడం ద్వారా అమ్మకాలు పెరుగుతాయనే భావనతో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్లో కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

సాంకేతికంగా రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్లో 1.5-లీటర్ సామర్థ్యం గల డిసిఐ కె9కె హెచ్‌పి డీజల్ ఇంజన్ కలదు.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

గతంలో ఇదే ఆర్ఎక్స్ఎస్ వేరియంట్లో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్‌గా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వంటివి ఉండేవి, అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఈ వేరియంట్లో రాలేకపోయింది.

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ ధర రూ. 10.75 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu To Know About Renault Has Updated The RxS Variant Of The Duster SUV With New Features
Story first published: Thursday, April 27, 2017, 20:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X