మోడీకి చూపించు: డిజీలాకర్ చూపించిన బైక్ రైడర్‌కు పోలీసు సమాధానం

Written By:

భారత్‌ను డిజిటల్ పథంలో నడిపించడానికి ప్రధాని మోడీ చేయని ప్రయత్నాలు లేవు. డిజిటల్ వినియోగం అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు డిజీలాకర్ అప్లికేషన్‌ను మోడీ గారు ప్రతిష్టాత్మకంగా భారత ప్రజల కోసం పరిచయం చేయడం అందరికీ తెలిసిందే.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డిజీలాకర్

అన్ని ప్రభుత్వ పత్రాలు మరియు డాక్యుమెంట్లను భద్రత పరుచుకోవడంతో పాటు వాటినే ఒరిజనల్ ప్రూఫ్‌గా స్వీకరించాలని కూడా పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ఏ మాత్రం తెలియని ఓ పోలీస్ ప్రధాని మోడీని అవహేళన చేశాడు. పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
డిజీలాకర్

అహ్మదాబాదులో ఓ టూ వీలర్ రైడర్ తన టూ వీలర్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను మోడీగారు ప్రారంభించిన డిజీలాకర్ అప్లికేషన్‌లో భద్రత పరుచుకున్నాడు. అయితే, పోలీసు ఆపి అడిగినందుకు డిజీలాకర్ లోని పత్రాలు చూపించాడు.

డిజీలాకర్

ఫోన్‌లో చూపించే ఇలాంటి పత్రాలు చెల్లవు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేనందుకు జరిమానా విధిస్తున్నాని చెప్పి ఆ రైడర్‌కు ఏకంగా రూ. 5,900 లు జరిమానా విధించాడు.

డిజీలాకర్

బాధిత రైడర్ ఇషాన్ రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన కథనం మేరకు, "తాను దొంగలించిన స్కూటర్‌లో వెళుతున్నాని ఓ పోలీస్ నన్ను నిలువరించాడు. అయితే, ఇది నా స్కూటరే కావాలంటే డాక్యుమెంట్స్ అన్ని డిజిలాకర్‌లో ఉన్నాయి చూడమంటే. అందుకు నిరాకరించాడు. ఒరిజనల్ డాక్యుమెంట్ల‌ను మాత్రమే చూపించాలని మొండికేశాడు. డిజిలాకర్‌లో ఉన్నవి చెల్లుతాయని మోడీగారే చెప్పారు కదా అన్నందుకు 'వెళ్లి మోడీకి చూపించు నాకు కాదని' ఆరోపించినట్లు తెలిపాడు."

డిజీలాకర్

ప్రజలు మరియు అధికారుల కోసం డిజిటల్ ఇండియాలో భాగంగా గత ఏడాది నరేంద్ర మోడీగారు డిజీలాకర్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఆయనకే ఎదురు దెబ్బ తగిలింది.

Trending On DriveSpark Telugu:

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి కులం పేరుతో తప్పించుకున్న తెలంగాణ పొలిటీషియన్

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్: అందరి కార్లు ఒక ఎత్తయితే, పవర్ స్టార్ కార్లు మరో ఎత్తు

ముఖేష్ అంబానీ కార్ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?

డిజీలాకర్

ఇషాన్ మాట్లాడుతూ, ఈ పోలీసుకు డిజీలాకర్ అప్లికేషన్ గురించి ఎలాంటి అవగాహన లేదు, మీరు కూడా డిజీలాకర్ ఓపెన్ చేయండి అందులో నా డాక్యుమెంట్లను ఎలా చెక్ చేయాలే నేర్పిస్తానన్నందుకు ఆ పోలీసు కోప్పడినట్లు పేర్కొన్నాడు.

డిజీలాకర్

ఇషాన్ మీద కోపోద్రిక్తుడైన పోలీసు సుమారుగా రూ. 5,900 ల జరిమానా విధించినట్లు చలానా ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఇషాన్ ఆ చలనాతో సహా అక్కడ జరిగిన తతంగం మొత్తాన్ని ట్వీట్ చేశాడు.

డిజీలాకర్

భారత్‌లో డిజీలాకర్‌కు చట్టబద్ధత ఉందా?

డిజీలాకర్ వెబ్‌సైట్ ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను అప్లికేషన్‌లో భద్రపరుచుకోవడానికి రోడ్డు రవాణా మరియు జాతీయరహదారుల మంత్రిత్వ విభాగంతో భాగస్వామిగా ఉంది.

డిజీలాకర్ అనుసంధానంతో ప్రయోజనాలు...

డిజీలాకర్

కాగిత రహిత కార్యకలాపాలు

డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ పత్రాలతో పేపర్ రూపంలో మరియు భౌతికంగా డాక్యుమెంట్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

డిజీలాకర్

ఒరిజినల్ డాక్యుమెంట్స్

ప్రజలు డిజీలాకర్‌లో ఉన్న తమ ఒరిజనల్ డాక్యుమెంట్లను గుర్తింపు, చిరునామా పత్రాలుగా వివిధ శాఖలలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. అన్ని శాఖలతో అనుసంధానం చేయడం ద్వారా డాక్యుమెంట్ల పరిశీలన ఎంతో సరళీకృతం అవుతుంది.

డిజీలాకర్

స్పాట్ వెరిఫికేషన్

డిజీలాకర్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చాలా తేలిక. నకిలీ పత్రాలను గుర్తించడం మరింత సులభతరమైపోయింది. డిజీలాకర్‌లో భద్రపరిచిన రోడ్డురవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుండి డిజిటల్ సిగ్నేచర్ గల డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పత్రాలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

English summary
Read In Telugu: Show it to Modi, traffic police tells biker who showed documents on Digilocker app
Please Wait while comments are loading...

Latest Photos