కొత్త కార్ల రిజిస్ట్రేషన్‌లకు శాశ్వత ముగింపు పలికిన సింగపూర్

Written By:

విపరీతమైన రద్దీ, రహదారులు రోజు రోజుకీ ఇరుకుగా మారిపోవడం, కాలుష్యం భారీగా పెరిగిపోవడం వంటి ఎన్నో అనర్థాలకు ప్రధాన కారణం వ్యక్తిగత వాహనాలు విపరీతంగా ఉండటం. ఈ ఆధునిక కాలంలో ఒక్కరు వెళ్లాలన్నా... ఇద్దరు వెళ్లాలన్నా కారు ఉండాల్సిందే. ఇలాంటి వాటి పర్యావసానం నేటి కథనం చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

అత్యంత ఇరుకుగా ఉండే సింగపూర్‌ నగరంలో కార్ల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఫిబ్రవరి 2018 నుండి కొత్త కార్లు రోడ్డు మీదకు రాకుండా చేసేందుకు రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిలిపివేసే నిర్ణయం తీసుకుంది.

Recommended Video
Skoda kodiaq Launched In India | In Telugu - DriveSpark తెలుగు
కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ తాజాగా వెల్లడించిన ప్రకటనలో వాహన విక్రయాల వృద్దిని 0.25 శాతం నుండి 0 కు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని 2020లో మరోసారి పునఃసమీక్షిస్తామని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది.

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

కొత్త కార్లు రిజిస్ట్రేన్లు నానాటికీ అధికమవ్వడంతో భూమి కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

కారును వ్యక్తిగత అవసరాలకు కొన్ని సంవత్సరాలు మాత్రమే వినియోగించుకునే అవకాశాన్ని వేలం ద్వారా దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ పద్దతి ద్వారా ప్రతి ఏటా కార్ల విక్రయాలను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తూ వచ్చింది.

Trending On DriveSpark Telugu:

విదేశాల్లో నీరాజనాలు పడుతున్న ఆ కారుకు ఇండియాలో ఘోర పరాభవం

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాటా హెక్సా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

హోండా నుండి దూసుకొస్తున్న మరో స్కూటర్: గ్రాజియా 125

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మాట్లాడుతూ, "భూమి కొరత ఎక్కువగా ఉండటంతో రోజూ వారి అవసరాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ చేపట్టాలన్నా భూమి కొరత వేధిస్తోంది. దీనికి ప్రత్యామ్నాంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది."

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

ప్రస్తుతం విధించిన బ్యాన్ 2018 ఫిబ్రవరి నుండి అమల్లోకి రానుంది. మరియు 2020 వరకు అమల్లో ఉండనుంది. తరువాత 2020లో ఆథారిటీ ఈ నియమాన్ని పునఃసమీక్షించనున్నట్లు తెలిపింది. సింగపూర్‌లో ఉన్న 56 లక్షల ప్రజలు ప్రస్తుతం ఉన్న 600,000 ల ప్రైవేట్ మరియు అద్దె వాహనాలనే మరో కొన్ని సంవత్సరాల పాటు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

ఈ కొత్త నిబంధన గూడ్స్ మరియు బస్సులకు వర్తించదు. ప్రస్తుతం ఉన్న 0.25 శాతపు వాహన వృద్ది రేటును యథావిధిగా కొనసాగించనుంది. అయితే, ప్రస్తుతం డ్రైవర్లు తమ పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ఎంచుకోవచ్చు.

కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రోడ్ల మీద కార్లు మరియు బైకుల పార్కింగ్‌కు గల భూమి ఆధారంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు సింగపూర్ ఒక నిష్పత్తి విధాన్ని అవలంభిస్తోంది. భూమి కొరత సమస్యను అధిగమించడానికి సింగపూర్ ఏకంగా కొత్త వాహనాల రిజిస్ట్రేన్లనే నిలిపివేసింది.

సింగపూర్ విధివిధానాల నుండి భారత ప్రభుత్వం కొంతైనా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే భారత జనాభా శరవేగంగా పెరుగుతోంది. భవిష్యత్తు తరాలను మరియు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu: Singapore Will Stop Registering Cars From Next Year
Please Wait while comments are loading...

Latest Photos