ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్‌ను జూన్ 2017 నాటికి సిద్దం చేస్తున్న స్కోడా

Written By:

స్కోడా ఇండియా ఆక్టావియా యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ ఫేస్‌లిఫ్ట్‌ను 2017 జూన్ నాటికి విడుదల చేయడానికి సిద్దమైంది. ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో ఆవిష్కరించబడింది. స్కోడా ఇందులో ఎక్ట్సీరియర్ మీద ప్రధానమైన మార్పులు చేసింది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్‌లో ఆ మార్పులు ఉన్నాయి.

ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ముందు వైపున సరికొత్త క్వాడ్ హెడ్ ల్యాంప్ అమరిక కలదు , డిజైన్ పరంగా స్వల్ప మార్పులకు గురైన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌ కలవు.

కారు ప్రక్కవైపుల మరింత స్పోర్టివ్ మరియు అగ్రెసివ్ లుక్ కోసం పదునైన డిజైన్ గీతలను బాడీ మీద కల్పించడం జరిగింది. వెనుక వైపు ఉన్న టెయిల్ లైట్ మరియు బంపర్ స్టైల్‌ను కూడా మార్చేశారు.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ప్రస్తుతం విపణి నుండి నిష్క్రమించనున్న ఆక్టావియాలో ఉన్న 9.2-అంగుళాల టచ్ స్క్రీన్ కలదు. స్కోడా యొక్క కొలంబస్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ మరియు సెంటర్ కన్సోల్ మీద కెపాసిటివ్ టచ్ బటన్లు ఉన్నాయి.

ఇండియాకు రానున్న ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది. ఇది ఆపిల్ కార్ ప్లే మరియు స్మార్ట్ ఫోన్ల యొక్క ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం స్కోడా ఇండియా లైనప్‌లో ఉన్న అవే ఇంజన్ వేరియంట్లను తమ ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొనసాగించే అవకాశం ఉంది. ఈ 2017 ఆక్టావియా మోడల్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో రానుంది.

ప్రస్తుతం పెట్రోల్ లైనప్‌లో 1.4-లీటర్ టిఎస్ఐ ఇంజన్, 1.6-లీటర్ టిఎస్ఐ ఇంజన్ మరియు డీజల్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌తో రానుంది.

స్కోడా ఇండియా ఆక్టావియా యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌తో పాటు శక్తివంతమైన ఆక్టావియా మోడల్‌ను కూడా అభివృద్ది చేస్తోంది. ఆక్టావియా విఆర్ఎస్ మోడల్ సెడాన్‌ను వచ్చే దీపావళి నాటికి విపణిలోకి తీసుకురానుంది.

సాంకేతికంగా స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ సెడాన్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్బో పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 230బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ మరియు అగ్రెసివ్ బాడీ స్టైల్లో రానుంది. స్కోడా ఆక్టావియా మరిన్ని ఫోటోల కోసం......

 

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Octavia Facelift To Launch In June 2017
Story first published: Monday, March 13, 2017, 11:10 [IST]
Please Wait while comments are loading...

Latest Photos