2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ నేడు(13 జూలై, 2017) ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15.49 లక్షలుగా ఉంది.

By Anil

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ నేడు(13 జూలై, 2017) ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా మొత్తం)గా ఉంది.

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆక్టావియా సెడాన్ కారును తొలి ఉత్పత్తిగా విపణిలోకి విడుదల చేసి, దేశీయంగా 2001లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు సరిగ్గా 16 సంవత్సరాల అనంతరం మూడవ తరానికి చెందిన ఆక్టివా సెడాన్ కారును మిడ్ లైఫ్ పేస్‌లిఫ్ట్ సెడాన్ వెర్షన్‌లో మళ్లీ విడుదల చేసింది.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

2017 స్కోడా ఆక్టివా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు

స్కోడా తమ 2017 ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్‌ను మూడు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి, ఆంబిషన్, స్టైల్ మరియు స్టైల్ ప్లస్- ఈ మూడు వేరియంట్లను ఫీచర్లు, స్టైలింగ్ మరియు సౌకర్యవంతమైన ఫీచర్ల అంశాల పరంగా కస్టమైజ్ చేసుకుని ఎంచుకోవచ్చు.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

స్కోడా ఆక్టావియాలోని ఆంబిషన్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభించును. ఆక్టావియా లోని స్టైల్ వేరియంట్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ఆక్టావియా స్టైల్ ప్లస్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే లభించును.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్ వివరాలు

స్కోడా మూడు ఇంజన్‌లతో లభిస్తోంది - అందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్. ఇందులోని 1.4-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ బేస్ పెట్రోల్ ఇంజన్‌ 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే ఇది లీటర్‌కు 16.7కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

స్కోడా ఆక్టావియాలోని శక్తివంతమైన పెట్రోల్ వెర్షన్‌లో 1.8-లీటర్ సామర్థ్యం గల టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. కేవలం 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో మాత్రమే లభించే ఇది 178బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు లీటర్‌కు 15.1కిమీల మైలేజ్ ఇస్తుంది.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

సరికొత్త ఆక్టావియాలోని డీజల్ వెర్షన్‌లో 2.0-లీటర్ సామర్థ్యం టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ మాత్రమే కలదు. ఇది 141బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్ 21కిమీ/లీ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ 19.5కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలవు.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

2017 ఆక్టావియా డిజైన్

డిజైన్ పరంగా స్కోడా ఆక్టావియాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రంట్ ఎండ్ డిజైన్‌లో సరికొత్త రూపాన్ని అందించారు. పెద్ద పరిమాణంలో ఉన్న బటర్ ఫ్లై ప్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా నాలుగు హెడ్ లైట్లు ఉన్నాయి. వీటిలోనే బ్లేడ్ ఆకారంలో ఉన్న పగటి పూట వేలిగే స్పోర్టివ్ ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. ఫ్రంట్ డిజైన్ క్రింది భాగంలో ఉన్న బంపర్‌లో ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ జోడించారు.

స్కోడా ఆక్టావియా రియర్ డిజైన్‌లో కూడా మార్పులు జరిగాయి. C-ఆకారంలో ఉన్న ఇల్యుమినేటెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు 205/ఆర్16 సైజులో ఉన్న గుడ్ ఇయర్ టైర్ల మీద ఆక్టావియా కూర్చొంది.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్రైవర్‌కు అధిక విజిబిలిటీ ఉండేలా డ్యాష్ బోర్డ్ నిర్మాణం చేపట్టారు. శాటిలైట్ న్యావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే ఆప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. స్మార్ట్ ఫోన్ ద్వారా బాస్ కనెక్ట్ అనే పేరుతో పిలువబడే స్కోడా అప్లికేషన్ ద్వారా ఈ మూడు వ్యవస్థలను ఆపరేట్ చేయవచ్చు.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

పది విభిన్న రంగుల్లో ఆంబియంట్ లైటింగ్, వర్షాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయ్యే ప్యానరోమిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనింగ్, కోల్డ్ గ్లూవ్ బాక్స్, పడల్ ల్యాంప్స్, మరియు కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సెగ్మెంట్లో తొలిసారిగా స్కోడా తమ ఆక్టావియాలో హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ సిస్టమ్ అందించింది. గేర్‌కు ముందువైపున్న ఓ బటన్ ప్రెస్ చేస్తే కారు తనంతట తానుగా స్టీరింగ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ బ్రేక్స్ మరియు యాక్సిలరేటర్ డ్రైవర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.

2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

స్కోడా ఆక్టావియా పెట్రోల్ వేరియంట్ల ధరలు (దేశవ్యాప్తంగా)

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
ఆక్టావియా ఆంబిషన్ 1.4 టిఎస్ఐ మ్యాన్యువల్ రూ. 15,49,405 లు
ఆక్టావియా స్టైల్ 1.4 టిఎస్ఐ మ్యాన్యువల్ రూ. 17,49,605 లు
ఆక్టావియా స్టైల్ 1.8 టిఎస్ఐ ఆటోమేటిక్ రూ. 18,59,429 లు
ఆక్టావియా స్టైల్ ప్లస్ 1.8 టిఎస్ఐ ఆటోమేటిక్ రూ. 20,89,900 లు
2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

స్కోడా ఆక్టావియా డీజల్ వేరియంట్ల ధరలు (దేశవ్యాప్తంగా)

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు
ఆక్టావియా ఆంబిషన్ 2.0 టిడిఐ సిఆర్ మ్యాన్యువల్ రూ. 16,89,974 లు
ఆక్టావియా స్టైల్ 2.0 టిడిఐ సిఆర్ మ్యాన్యువల్ రూ. 18,95,608 లు
ఆక్టావియా స్టైల్ 2.0 టిడిఐ సిఆర్ ఆటోమేటిక్ రూ. 20,49,619 లు
ఆక్టావియా స్టైల్ ప్లస్ 2.0 టిడిఐ సిఆర్ ఆటోమేటిక్ రూ. 22,89,573 లు
2017 స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

2017 స్కోడా ఆక్టావియాలో భద్రత ఫీచర్లు

సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ ఒత్తిడికి గురవ్వడాన్ని గుర్తించే టెక్నాలజీ, మల్టీ కొల్లిషన్ బ్రేకింగ్ సిస్టమ్(ప్రమాదానికి ముందే బ్రేకులు వేసే వ్యవస్థ) మరియు ప్రమాదం జరిగిన వెంటనే ఇంజన్‌కు ఇంధన సరఫరా నిలిపివేసే వ్యవస్థను స్కోడా ఇందులో అందించింది.

Most Read Articles

English summary
Read In Telugu: 2017 Skoda Octavia Facelift Launched In India; Prices Start At Rs 15.49 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X