భారత్ కోసం స్కోడా బడ్జెట్ కారు

Written By:

ఖరీదైన సెడాన్ కార్ల తయారీ సంస్థగా భారత్‌లో స్కోడా సుపరిచితం. ప్రీమియమ్ సెడాన్ కార్ల సెగ్మెంట్ ద్వారా అతి కొద్ది కస్టమర్లను మాత్రమే చేరుకున్న స్కోడా ఇప్పుడు బడ్జెట్ కారుతో ప్రతి ఇండియన్ కస్టమర్ మనస్సు దోచుకోవడానికి సిద్దమైంది.

స్కోడా బడ్జెట్ కారు

నిజమే, సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా అత్యంత సరసమైన చిన్న కారును ప్రత్యేకించిన ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. టాటా మోటార్స్‌తో ఉన్న భాగస్వామ్యుపు ఒప్పందం ముగిసిన తరువాత స్కోడా కొత్త ప్రాజెక్టుల మీద దృష్టిసారిస్తోంది.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా బడ్జెట్ కారు

ప్రస్తుతం స్కోడా అంతర్జాతీయ విపణిలో సిటిగో అనే చిన్న కారు ఉంది. అయితే దేశీయ స్మాల్ ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

స్కోడా బడ్జెట్ కారు

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ప్రతేకించి భారత్ కోసం స్కోడా అభివృద్ది చేస్తున్న చిన్న కారు 2020 నాటికి విపణిలోకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్కోడా బడ్జెట్ కారు

సెడాన్ కార్ల లైనప్‌లో విభిన్న మోడళ్లు కలిగి ఉన్న స్కోడా ఫ్యాబియా అనే హ్యాచ్‌బ్యాక్ అందుబాటులో ఉంచింది. ఆ తరువాత వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన ఫేస్‌లిఫ్ట్ ఫ్యాబియాను మార్కెట్ నుండి వైదొలగింది.

స్కోడా బడ్జెట్ కారు

వోక్స్‌వ్యాగన్ గ్రూపు టాటా మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో అత్యంత సరసమైన చిన్న కార్లను తయారు చేయాలని భావించింది. అయితే ఉమ్మడి భాగస్వామ్యానికి సానుకూల స్పందన లభించకపోవడంతో వోక్స్‌వ్యాగన్ గ్రూపు ఇతర ఆవకాశాలు కోసం చూస్తోంది.(గమనిక వోక్స్‌వ్యాగన్ గ్రూపు స్కోడా కు మాతృ సంస్థ).

స్కోడా బడ్జెట్ కారు

వోక్స్‌వ్యాగన్ తమ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ వేదికగా చిన్న కార్ల తయారీకి సిద్దమైనట్లు తాజాగా కొన్ని వార్తలు వచ్చాయి. అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఔరంగాబాద్‌లోని ప్రొడక్షన్ ప్లాంటులో ఆక్టావియా మరియు టిగువాన్ లను ఉత్పత్తి చేస్తోంది.

స్కోడా బడ్జెట్ కారు

టాటా మోటార్స్ మరియు వోక్స్‌వ్యాగన్ గ్రూపు ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చిన్న కార్లను తయారు చేయాలని భావించింది. ఈ ఫ్లాట్‌ఫామ్ మీద చిన్న కార్ల అభివృద్ది మరియు తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది కావడంతో, చిన్న కార్ల తయారీకి ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఉత్తమమని జర్మన్ దిగ్గజం ఇండియాలో MQB ని ఆవిష్కరించింది.

స్కోడా బడ్జెట్ కారు

స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ గ్రూపునకు చెందిన ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా సిటిగో తరహా చిన్న కారును అభివృద్ది చేస్తే, ప్రస్తుతం మారుతి సుజుకి విపణిలో అందుబాటులో ఉంచిన సెలెరియో, వ్యాగన్ ఆర్, ఆల్టో లతో పాటు హ్యుందాయ్ ఇయాన్, రెనో క్విడ్ మరియు డాట్సన్ రెడి గో వంటి కార్లకు గట్టి పోటినివ్వనుంది.

స్కోడా బడ్జెట్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ గ్రూపుకు ఇండియాలో ఎలాంటి చిన్న కార్లు లేవు. చిన్న కార్లను తయారు చేయడం కోసం వోక్స్‌వ్యాగన్ గ్రూపు టాటా మోటార్స్‌తో చేతులు కలపడానికి ప్రయత్నించింది. అయితే చర్చలు విఫలమవడంతో తమ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ మీద ఫ్యాబియా, గోల్ఫ్ మరియు సిటిగో వంటి మోడళ్లను తయారు చేయాలని భావిస్తోంది.

Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: Skoda Developing New Small Car For India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark