NS160 విడుదల వచ్చే నెలలోనే, డీలర్ల వద్దకు చేరిన బైకులు
దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజ బజాజ్ ఆటో ఎన్ఎస్160 ను లాంచ్‌కు సిద్దమయ్యింది. అయితే విడుదలకు ముందే ఆ మోడల్‌ను డీలర్ల వద్దకు చేరుస్తోంది బజాజ్.
దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజ బజాజ్ ఆటో మరో ప్రొడక్ట్ లాంచ్‌కు సిద్దమయ్యింది. అయితే విడుదలకు ముందే ఆ బైకులను డీలర్ల వద్దకు చేరుస్తోంది బజాజ్. ఇప్పటికే పలుమార్లు రహదారి పరీక్షించిన ఈ సరికొత్త పల్సర్ ఎన్ఎస్160 మోటార్ సైకిల్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

బజాజ్ ఆటో డీలర్ల వద్దకు రహస్యంగా చేరిన పల్సర్ ఎన్ఎస్160 బైకును ఓ మీడియా దిగ్గజం గుర్తించి, కెమెరాతో ఫోటోలను క్లిక్‌మనిపించింది. ఎన్ఎస్160 మీద తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే విడుదలకు ఎంతో సమయం లేదని తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం బజాజ్ ఆటో విపణిలో నుండి తొలగించిన ఏఎస్150 మోడల్ ఆధారంగా సరికొత్త ఎన్ఎస్160 బైకును అభివృద్ది చేసింది. బజాజ్ లైనప్‌లో పల్సర్ 150కి పై స్థానాన్ని భర్తీ చేయనున్న ఇది, ఎన్ఎస్200 డిజైన్ లక్షణాలను పోలి ఉంది.

160సీసీ సెగ్మెంట్లో మరే బైకులో చూడని విధంగా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్(ఇంజన్ క్రింద చిన్నగా ఉన్న పొగగొట్టం), రెండుగా చీలిపోయి ఉన్న గ్రాబ్ రెయిల్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అయితే రియర్ డిస్క్ బ్రేక్ ఇందులో రావడం లేదు.

బజాజ్ ఆటో ప్రస్తుతం పల్సర్ ఎన్ఎస్160 మోటార్ సైకిల్‌ను టర్కీకి ఎగుమతి చేస్తోంది. టర్కీ మోడల్ ఎన్ఎస్160లో ముందు వైపు చక్రానికి సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కలదు. అయితే ఈ ఆప్షన్ ఇండియన్ మోడల్ ఎన్ఎస్160లో వచ్చే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇంజన్ పరంగా పల్సర్ ఎన్ఎస్160 లో 160సీసీ సామర్థ్యం గల ఆయిల్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 15.05బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

160సీసీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న యమహా ఎఫ్‌జడ్ ఎఫ్ఐ వి2.0, సుజుకి జిక్సర్ మరియు హోండా సిబి హార్నెట్ 160ఆర్ వంటి జపాన్ మోడళ్లకు గట్టిపోటీనివ్వనున్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైకు జూలై 2017 లో విపణిలోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బజాజ్ టూ వీలర్స్ నూతన మోడళ్ల విడుదలతో ఇండియన్ మార్కెట్లో మంచి ఫలితాలను సాధిస్తోంది. డామినర్ 400 మరియు ఎన్ఎస్200 లతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 160సెగ్మెంట్లోకి ఎన్ఎస్160 బైకును విడుదల చేస్తూ, ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో జపాన్ మోడళ్లకు దీటైనపోటీనివ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications








